ముద్దనూరులో స్టాపింగ్‌కు అనుమతి మంజూరు
ముద్దనూరు : మచిలీపట్నం–ధర్మవరం ఎక్స్‌ప్రెస్ రైలు (రైలునం.17215–17216)కు ముద్దనూరులో స్టాపింగ్‌కు అనుమతులు మంజూరయ్యా యి. ఈ రైలుకు తమ స్టేషన్‌లో స్టాపింగ్ కల్పించా లని ముద్దనూరు మండల ప్రజలు ఇటీవల ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి వినతిపత్రం అందించారు. ఈ మేరకు ఎంపీ ఈ విషయాన్ని ఇటీవల కేంద్ర రైల్వే శాఖ మంత్రికి లిఖితపూర్వకంగా విన్నవించారు. ఈ నేపథ్యంలో సదరు రైలుకు ముద్దనూరు స్టేషన్‌లో స్టాపింగ్ సౌకర్యం కల్పిస్తూ కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ అనుమతులు మంజూ రు చేసింది. ఈ నిర్ణయంపై మండలవాసులు హర్షవ్యక్తం చేశారు. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్రజల తరఫున వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త,ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఎంపీకి ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు.
శని, ఆదివారాల్లోనూ
దరఖాస్తుల స్వీకరణ
కడప ఎడ్యుకేషన్ : జిల్లాలో సమగ్ర శిక్ష సొసైటీ ద్వారా నడుస్తున్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర సి బ్బంది పోస్టులను (35 ఖాళీలు) పొరుగు సేవల (ఔట్‌సోర్సింగ్) ప్రాతిపదికన భర్తీ చేయుటకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను 10వ తేదీ రెండవ శనివారం, 11వ తేదీ ఆదివారం కూడా స్వీకరించనున్నట్లు సమగ్రశిక్ష ఏపీసీ ప్రేమంత్‌కుమార్ తెలిపారు. ప్రభుత్వ సెలవు రోజులయినప్పటికీ కార్యాలయ సిబ్బంది విధుల్లో కొనసాగి అభ్య ర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారని తెలిపారు. అభ్యర్థులు దరఖాస్తులు అందజేయాలని సమగ్రశిక్ష ఏపీసీ వివరించారు.
క్రీడలతో మానసికోల్లాసం
జమ్మలమడుగు : క్రీడలతో మానసికోల్లాసం పొందొచ్చని ఆర్జేడీ శ్యామూల్స్ పేర్కొన్నారు. ఆటగాళ్లు వివిధ ప్రాంతాల్లో జరిగే క్రీడా పోటీల్లో పాల్గొనడం ద్వారా ఆ ప్రాంత సంస్కృతి సంప్రదాయాలతోపాటు కొత్త పరిచయాలు ఏర్పడతా యని అన్నారు. బుధవారం వాలీబాల్ జాతీయ స్థాయి క్రీడల పోటీలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడాస్ఫూర్తి కలిగి ఉండాలన్నారు. ఇలాంటి ఆటలు ఆడటం ద్వారా క్రీడా నైపుణ్యం మెరుగుపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఎంఈఓ చంద్రశేఖర్‌రావు, ఆర్గనైజింగ్ సెక్రెటరీ ప్రసాద్‌రెడ్డి,శివశంకర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, హే మాంబర్‌రెడ్డి, మురళీ తదితరులు పాల్గొన్నారు
హాల్‌టికెట్లు విడుదల
రాజంపేట : రాజంపేట మండలం నారమరాజుపల్లెలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2026– 2027 విద్యాసంవత్సరానికి 9, 11వ తరగతులలో ప్రవేశపరీక్ష రాసేందుకు హాల్‌టికెట్లు విడుదలైనట్లు ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ గంగాధరన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 7న ప్రవేశపరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. ప్రవేశపరీక్ష నిమిత్తం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల రిజిస్ట్రేషన్ నంబరు, పుట్టినతేది నమో దు చేసి ఆన్లైన్ కింద ఇచ్చిన లింక్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. లింక్ హెచ్‌టీటీపీః//సీబీఎస్‌ఈఐటీఎంఎస్.ఆర్‌సీఐఎల్.జీఓవీ.ఇన్/ఎన్‌వీఎస్/ను సంప్రదించాలని సూచించారు.
శాస్త్రోక్తంగా అధ్యయనోత్సవాలు
ఒంటిమిట్ట : పవిత్ర ధనుర్మాసంలో భాగంగా 20వ రోజైన బుధవారం ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో అధ్యయనోత్సవాలు శాస్త్రోక్తంగా సాగాయి. రంగమండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పీఠంపై కొలువు తీరిన సీతారామలక్ష్మణ ఉత్సవ మూర్తులను పట్టువస్త్రాలు, అభరణాలు, పుష్పమాలలతో అలంకరించారు. అనంతరం వేదపండితులు రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలను పారాయణం చేశారు. మూల విరాట్ దర్శనానికి వచ్చేసిన భక్తులకు ఈ మహత్కార్యాన్ని తిలకించే భాగ్యం లభించింది.
ముద్దనూరులో స్టాపింగ్‌కు అనుమతి మంజూరు
ముద్దనూరులో స్టాపింగ్‌కు అనుమతి మంజూరు


