అట్టహాసంగా పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్
కడప అర్బన్ : వైఎస్‌ఆర్ జిల్లా పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్– 2025 ముగింపు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్‌తో కలిసి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల రోడ్ సేఫ్టీ సమావేశంలో జిల్లా ఎస్పీ ఒక ప్రతిపాదన చేయడం జరిగిందని, జిల్లాలో సంవత్సరానికి సగటున దాదాపు 700 నుంచి 800 మంది యువకులు తలకు గాయంతో ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ప్రమాదాలను నివారించేందుకు పోలీస్ సిబ్బందికి హెల్మెట్స్ ఇవ్వనున్నట్లు తెలిపిన జిల్లా ఎస్పీ వాటిని అందచేసే మంచి అవకాశం ఇవ్వడం పట్ల సంతోషంగా ఉందన్నారు. క్రీడల్లో ఓవరాల్, వ్యక్తిగత, టీమ్ ఛాంపియన్ షిప్ విభాగంలో విజేతలకు జిల్లా కలెక్టర్ అభినందనలు తెలిపారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గత నాలుగు రోజులుగా క్రీడల నిర్వహణకు చక్కగా ఏర్పాట్లు చేశారని నిర్వాహకులైన ఏఆర్ పోలీస్ అధికారులు, గ్రౌండ్ స్టాఫ్‌నకు అభినందనలు తెలిపారు. స్పోర్ట్స్ మీట్‌లో ఓవరాల్ చాంపియన్‌గా డి.ఏ.ఆర్ జట్టు నిలవగా, వ్యక్తిగత విభాగంలో చాంపియన్‌గా కానిస్టేబుల్ ఎల్.సతీష్(పి.సి 3322) కడప సబ్–డివిజన్ టీం చాంపియన్ షిప్ సాధించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్.పి(అడ్మిన్) కె.ప్రకాష్ బాబు, అడిషనల్ ఎస్పీ (ఏ.ఆర్) బి.రమణయ్య, స్పెషల్ బ్రాంచ్ డి.ఎస్.పి ఎన్.సుధాకర్, కడప డి.ఎస్.పి ఏ.వెంకటేశ్వర్లు, జమ్మలమడుగు డి.ఎస్.పి కె.వేంకటేశ్వరరావు, ప్రొద్దుటూరు డి.ఎస్.పి పి.భావన, పులివెందుల డి.ఎస్.పి మురళి, మైదుకూరు డి.ఎస్.పి జి.రాజేంద్ర ప్రసాద్, డి.టి.సి డి.ఎస్.పి అబ్దుల్ కరీమ్, జిల్లాలోని సీఐలు, ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


