ఈ–గవర్నెన్స్ ద్వారా ప్రజలకు సేవలు
కడప సెవెన్‌రోడ్స్: ఈ–గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు సమర్థవంతంగా అందించాలని జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ సుబ్రమణ్యం అన్నారు. సోమవారం జెడ్పీ ఆవరణలోని డీపీఆర్‌సీ భవనంలో ఏఓలు, జూనియర్ అసిస్టెంట్లకు నిర్వహించిన శిక్షణ తరగతుల్లో ఆయన పాల్గొన్నారు. మనమిత్ర ద్వారా సర్టిఫికెట్లు, బిల్లు చెల్లింపులు సహా 160కి పైగా ప్రభుత్వ సేవలను యాక్సెస్ చేయడానికి వాట్సాప్ ఆధారిత ప్లాట్‌ఫాం పాలనను అందుబాటులోకి తెస్తుందన్నారు. డిజిటల్ మౌలిక సదుపాయాలు, డేటా అనలిటిక్స్, డిజిటలైజేషన్, సిటిజన్ సెంట్రిక్ డెలివరీ తదితర అంశాల గురించి వివరించారు.
కడప సెవెన్‌రోడ్స్: జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం జిల్లా ఇన్‌చార్జిమంత్రి సవిత రానున్నట్లు కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తొలి రోజు పర్యటనలో భాగంగా కమలాపురం నియోజకవర్గం వీఎన్ పల్లి మండల కేంద్రంలో రైతులకు నష్ట పరిహారాన్ని అందజేయనున్నారు. అనంతరం నందలూరు మండలం యల్లంరాజు పల్లి గ్రామంలో రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ బుక్‌లు పంపిణీ చేయనున్నారు.


