● కల నెరవేర్చిన మిథున్‌రెడ్డి | - | Sakshi
Sakshi News home page

● కల నెరవేర్చిన మిథున్‌రెడ్డి

Jan 6 2026 7:24 AM | Updated on Jan 6 2026 7:24 AM

● కల నెరవేర్చిన మిథున్‌రెడ్డి

● కల నెరవేర్చిన మిథున్‌రెడ్డి

● కల నెరవేర్చిన మిథున్‌రెడ్డి

రాజంపేట పార్లమెంటు పరిధిలో ఉమ్మడి చిత్తూరులోని తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు, వాయల్పాడు, ఉమ్మడికడపలోని రాజంపేట, రాయచోటి, కోడూరు అసెంబ్లీ నియోజకవర్గాలతో కలిసి ఉండేది. 2009లో వాయల్పాడు నియోజకవర్గం కనుమరుగు కావడంతో దానిస్థానంలో పుంగనూరు నియోజకవర్గం కలిసింది. 1967 నుంచి 2014 వరకు అన్ని పార్టీలు కడపజిల్లాకు చెందిన వారినే అభ్యర్థులుగా ఎంపికచేసేవి. నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న ఉమ్మడి చిత్తూరుకు అభ్యర్థిత్వం దక్కేదికాదు. ఎంపీలంతా కడపవైపు వాళ్లే ఉండేవారు.2014లో మిథున్‌రెడ్డి రాజంపేట ఎంపీ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ నుంచి బరిలో నిలిచి ఘన విజయం సాధించడంతో చిత్తూరు ప్రజల కోరిక నెరవేరింది.

హ్యాట్రిక్‌లో మిథున్‌రెడ్డి రికార్డు

2014 ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగిన మిఽథున్‌ రెడ్డి పురందేశ్వరీపై 1,74,762 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2019 ఎన్నికలో 2,68,284 ఓట్ల మెజార్టీ సాధించారు. రాజంపేట పార్లమెంటు ఎన్నికల చరిత్రలో ఇదే అత్యధిక మెజార్టీ. 2024లోనూ గెలిచి హ్యాట్రిక్‌ సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement