చెస్‌లో జిల్లా క్రీడాకారుల ప్రతిభ
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన 11 మంది క్రీడాకారులు చెస్ పోటీల్లో రాణించారు. ఈ నెల 4న బెంగళూరులోని మంజునాథ్ కళ్యాణ మండపం లో నిర్వహించిన 22వ బీఆర్‌డీసీఏ ర్యాపిడ్ ఇంటర్నేషనల్ రేటింగ్ చెస్ టోర్నమెంట్‌లో మొత్తం 466 మంది క్రీడాకారులు పాల్గొనగా జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనపరిచినట్లు జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి అనీష్ దర్బారీ తెలిపారు. ప్రొద్దుటూరుకు చెందిన ధనిత సింధురాజు అండర్–10 బాలికల విభాగంలో 4వ స్థానం, కడప కు చెందిన అనీస్ దర్బారి 50 ఏళ్లు పైబడిన విభాగంలో 1వ స్థానం సాధించి నగదు బహుమతి గెలుచుకున్నారు. దేవునికడప కు చెందిన వినమ్రత్ కు టోర్నమెంట్‌లో అతి చిన్న వయసు క్రీడాకారుడిగా ట్రోఫీ లభించింది. అర్హాన్ నలుగురు రేటెడ్ క్రీడాకారులపై విజయాలు సాధించాడు.ప్రణవ్ స్వరూప్ రేటెడ్ క్రీడాకారులపై 2.5 పాయింట్లు సాధించగా నిఖిలేశ్వర ఒక రేటెడ్ క్రీడాకారుడిపై విజయం సాధించాడు. రీహాన్ 6 పాయింట్లు, లక్ష్మీ 3 పాయింట్లు, భద్ర 2.5 పాయింట్లు, షయాన్ 2 పాయింట్లు సాధించారు.


