కుక్కల దాడిలో 25 గొర్రెలు మృతి
తొండూరు : తొండూరు మండలం కోరవానిపల్లి గ్రామంలో కుక్కలు బీభత్సం సృష్టించాయి. కొప్పల రామాంజనేయులుకు చెందిన గొర్రెల మందపై దాడి చేశాయి. ఈ ఘటనలో 25 గొర్రెలు మృతి చెందగా మరో 10 గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. సోమవారం ఉదయం మృతి చెందిన గొర్రెలను చూసి రైతు తీవ్రంగా కుంగిపోయారు. ఈ దాడి వల్ల తమకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లిందని, అధికారులు స్పందించి నష్టపరిహారం అందించాలని బాధితుడు కోరారు.
రాష్ట్ర స్థాయి పోటీలకు
ఎంపిక
కమలాపురం : కమలాపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన కబడ్డీ జట్టు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపల్ సత్య నారాయణ రెడ్డి తెలిపారు. ఈ నెల 4వ తేదీన జమ్మల మడుగులో జరిగిన పాలిటెక్నిక్ కళాశాలల జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో కమలాపురం జట్టు పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. అలాగే అథ్లెటిక్స్ విభాగంలో 400మీటర్ల రిలే పోటీల్లో ద్వితీయ స్థానం, 800 మీటర్ల పరుగు పోటీల్లో తృతీయ స్థానంలో తమ కళాశాల విద్యార్థులు నిలిచారని ప్రిన్సిపల్ తెలిపారు. క్రీడాకారులు, ఫిజికల్ డైరెక్టర్ వీరాంజనేయులును ప్రిన్సిపల్ అభినందించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.
బైక్‌పై నుంచి కిందపడి బేల్దారి మృతి
ఎర్రగుంట్ల : మండల పరిధిలోని పెద్దనపాడు గ్రామం సమీపంలోని శివాలయంనకు వెళ్లే క్రాస్ వద్ద స్కూటర్‌పై వెళ్తున్న కొమ్మెర మునిశేఖర్ (58) బేల్దారి మృతి చెందాడు. ఎర్రగుంట్ల సీఐ విశ్వనాథ్‌రెడ్డి కథనం మేరకు వీఎన్‌పల్లి మండలం యు. వెంకటాపురం గ్రామానికి చెందిన కొమ్మెర మునిశేఖర్ బెల్దారి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం ఎర్రగుంట్ల నుంచి స్వగ్రామానికి బైక్‌లో వెళుతుండగా పెద్దనపాడు గ్రామానికి సమీపంలోని శివాలయం క్రాస్ వద్దకు రాగానే అదుపు తప్పి రోడ్డు పక్కన ఉండే గుంతలో పడి అక్కడికక్కడే మృతి చెందాడు,. మృతుడి కుమారుడు మునీంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
వేధింపులపై కేసు నమోదు
కాశినాయన : మండలంలోని బాలాయపల్లె గ్రామానికి చెందిన ఓ మహిళను అదే గ్రామానికి చెందిన పాలకొలను వెంకటరామిరెడ్డి వారం రోజులుగా వేధిస్తున్నాడు. సోమవారం మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ యోగేంద్ర తెలిపారు.
కుక్కల దాడిలో 25 గొర్రెలు మృతి
కుక్కల దాడిలో 25 గొర్రెలు మృతి


