ఆటోను ఢీకొన్న కళాశాల వ్యాన్: ముగ్గురికి గాయాలు
రోడ్డు మధ్యలో నిలిచిన పోయిన వ్యాన్
నాలుగురోడ్ల కూడలిలో గుమికూడిన జనాలు
ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలిలో సోమవారం ప్రైవేట్ జూనియర్ కళాశాలకు చెందిన వ్యాన్ ఆటోను ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి..
ప్రొద్దుటూరుకు చెందిన విజ్ఞాన్ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన వ్యాన్ సోమవారం రాత్రి ఎర్రగుంట్లలోని నాలుగు రోడ్ల కూడలి వద్దకు రాగానే బ్రేక్ ఫైయిలైంది. ముందు పోతున్న ఆటోను ఢీకొంది. ఆటో కూడా ముందు వెళుతున్న బైక్‌ను ఢీకొంది. దీంతో బైక్‌లో వెళుతున్న ఇద్దరు, రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న మరొకరు గాయపడ్డారు. వీరిలో రోడ్డుపై వెళుతున్న దస్తగిరి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఇతన్ని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. వ్యాన్‌లో ఉన్న విద్యార్థినులకు ఏమీ కాలేదు. వ్యాన్ ముందు భాగం నుజ్జునుజ్జు కాగా, ఆటో వెనుక భాగం దెబ్బతింది. వ్యాన్ రోడ్డు మధ్యలో ఉండి పోవడంతో నాలుగు రోడ్ల కూడలిలో ట్రాఫిక్ స్తంభించింది. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోని క్రేన్ సాయంతో వ్యాన్‌ను పక్కకు తప్పించారు. ఈ సంఘటనపై విచారణ చేస్తున్నట్లు సీఐ విశ్వనాథ్‌రెడ్డి తెలిపారు.
ఆటోను ఢీకొన్న కళాశాల వ్యాన్: ముగ్గురికి గాయాలు


