బాధితులకు న్యాయం చేయాలి
కడప అర్బన్ : బాధితుల సమస్యలపై సత్వరమే స్పందించి, న్యాయం చేయాలని జిల్లా ఎస్.పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ‘‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’’కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రలు వివిధ సమస్యలపై అర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ ఫిర్యాదుదారులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నడవలేని వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా వీల్ చైర్లను ఏర్పాటు చేశారు. మొత్తం 81 ఫిర్యాదులు(పిజిఆర్‌ఎస్)కు వచ్చాయి. కార్యక్రమంలో అదనపు ఎస్పీ(పరిపాలన) కె. ప్రకాష్ బాబు మహిళా పీఎస్ డీఎస్పీ బాలస్వామి రెడ్డి పాల్గొన్నారు.
అగ్నిప్రమాదం : రూ.12 లక్షల ఆస్తి నష్టం
కడప అర్బన్ : కడప నగరంలోని సప్తగిరి ఎలక్ట్రానిక్స్ గోడౌన్ లో ఉన్నట్టుండి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు ఆర్పేందుకు కృషి చేశారు. ఈ ప్రమాదంలో దాదాపు 12 లక్షల రూపాయల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు నష్టపోయినట్లు సమాచారం. ఎలక్ట్రానిక్స్ గోడౌన్ యజమాని మురళీమోహన్ మాట్లాడుతూ విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం చోటు చేసుకుందని, దాదాపు రూ. 12 లక్షల మేరకు ఆస్తి నష్టం జరిగిందని తెలియజేశారు.
బాధితులకు న్యాయం చేయాలి


