పులివెందుల మున్సిపల్ కమిషనర్‌పై సస్పెన్షన్ వేటు
పులివెందుల : పులివెందుల మున్సిపల్ కమిషనర్ రాముడుపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. సీడీఎమ్‌ఏ కార్యాలయంలో రిపోర్ట్ చేసుకోవాలని సోమవారం ఆదేశాలు రావడంతో ఆయన బయలుదేరి వెళ్లారు. పులివెందుల ఇన్‌చార్జి కమిషనర్‌గా డీఈసీ సురేశ్‌బాబును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల మున్సిపల్ కమిషనర్ రాముడుపై వేధింపుల ఆరోపణలు రావడంతో ఈ చర్యలు తీసుకున్నారు.
● పులివెందుల మున్సిపల్ కార్యాలయంలో పారిశుధ్య విభాగంలో పనిచేసే పలువురు చిరుద్యోగులను మున్సిపల్ కమిషనర్ రాముడు వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. మున్సిపల్ కార్యాలయంతోపాటు ఇంట్లో కూడా క్లీనింగ్ పనులు చేయాలని హుకుం జారీ చేసేవారని,ఇంటికి పోతే అసభ్యకరంగా ప్రవర్తించేవాడని మహిళా ఉద్యోగులు ఆరోపించారు. ఆయన మాట వినకపోతే సమావేశం నెపంతో అనేకమార్లు తన కార్యాలయానికి రప్పించుకొని మహిళా సచివాలయ సిబ్బందిపై సైతం వేదింపులకు పాల్పడ్డారని సమాచారం. కనీసం కూర్చోమనేవాడు కాదని, మీటింగ్ మొత్తం నిలబెట్టేవారని వారు ఆరోపించారు. దీనిపై ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని విచారణ చేపట్టి అధికారిపై చర్యలు తీసుకోవాలని మహిళా ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం ‘సాక్షి’లో వార్త ప్రచురితం కావడంతో అధికారులు స్పందించారు. రాముడుపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు.
మహిళా చిరుద్యోగులపై
అధికారి లైంగిక వేధింపులే కారణం
పులివెందుల మున్సిపల్ కమిషనర్‌పై సస్పెన్షన్ వేటు


