వాలీబాల్ పోటీలకు వేళాయె..
జమ్మలమడుగు: స్కూల్‌గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరగనున్న జాతీయస్థాయి అండర్–14 బాలికల వాలీబాల్ పోటీలకు సర్వం సిద్ధం చేశారు. జమ్మలమడుగులో సోమవారం నుంచి జరిగే ఈ పోటీలకు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. వివిధ రాష్ట్రాలనుంచి క్రీడాకారిణిలు జమ్మలమడుగుకు చేరుకున్నారు. మొత్తం 30 టీంలు పాల్గొననుండగా ఇప్పటికే 27 టీంలు చేరుకున్నాయని ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులుపేర్కొన్నారు. తమిళనాడు మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, ఒడిశా ఉత్తరాఖండ్,రాజస్థాన్, తెలంగాణ, గోవా కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన టీంలు ఇప్పటికే జమ్మలమడుగుకు చేరుకున్నాయి. వీరికి పట్టణంలోని ప్రముఖ కల్యాణ మండపాలతోపాటు, గండికోటలోని అడ్వెంచర్స్ అకాడమిలో విడిది ఏర్పాట్లు చేశారు.
● సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఈ పోటీలలో మొదట జమ్మూకశ్మీరు– రాజస్థాన్ జట్ల మధ్య ఉదయం 9 గంలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.
గోవా టీంకు స్వాగతం పలుకుతున్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్, జమ్మలమడుగుకు చేరుకున్న ఆంధ్రప్రదేశ్ టీం
వాలీబాల్ పోటీలకు వేళాయె..


