చరిత్రహీనులుగా మిగిలిపోతారు
బద్వేలు అర్బన్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో చేతులు కలిపి రాయలసీమకు నీరు రాకుండా చేసిన చంద్రబాబు చరిత్రహీనులుగా మిగిలిపోతారని ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ఎన్‌జీఓ కాలనీలోని ఆమె నివాసంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిసారి రాయలసీమకు అన్యాయమే చేశారని అన్నారు. రాయలసీమలో పుట్టి ఈ ప్రాంతంలోని ప్రజలకు అవసరమైన ఎత్తిపోతల పథకాన్ని తన స్వార్థ ప్రయోజనాల కోసం నిలిపివేయడం దుర్మార్గమన్నారు. అత్యంత వెనుకబడిన రాయలసీమ ప్రాంతాన్ని రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా సస్యశ్యామలం చేయడానికి గతంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తే అందుకు విరుద్ధంగా చంద్రబాబు చర్యలు చేపట్టడం ఇక్కడి ప్రజల దురదృష్టమన్నారు. ఇప్పటికై నా చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను ఖండించాలని, లేనిపక్షంలో చంద్రబాబును రాయలసీమ ప్రజలు ఎట్టిపరిస్థితుల్లో క్షమించరని అన్నారు. అలాగే రాయలసీమ ప్రాంతానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు తక్షణమే రాజీనామా చేసి ప్రజల ప్రయోజనాలను కాపాడాలని కోరారు.
ఎమ్మెల్యే డాక్టర్ సుధ


