భగీరథుని విగ్రహ ఏర్పాటుకు కృషి
ప్రొద్దుటూరు కల్చరల్ : భగీరథుని విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తానని సగర కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పేట చంద్రశేఖర్ పేర్కొన్నారు. స్థానిక మండి మర్చంట్స్ వీధిలోని మిల్లులో ఆదివారం సగర సంఘ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సగర సంఘం పెద్దలు మండలంలో లేదా పట్టణంలో స్థలం గుర్తిస్తే భగీరథుని విగ్రహ ఏర్పాటుకు తనవంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానన్నారు. సగరులను బీసీ–డీ నుంచి బీసీ–ఏకు మార్చాలని ప్రభుత్వానికి విన్నవించడం జరిగిందన్నారు. సగర సంఘం జిల్లా అధ్యక్షుడు మజ్జారి వీరమోహన్ మాట్లాడుతూ సగరులు ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నారని, వారి అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలన్నారు. సగర కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని కోరారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బయన్న మాట్లాడుతూ ఐకమత్యంతోనే సగరుల అభివృద్ధి సాధ్యమని తెలిపారు. సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2026 క్యాలెండర్‌ను ముఖ్య అతిథులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి యానిక సుబ్బారావు, మాజీ డైరెక్టర్ మురళీ, కోశాధికారి జోడు ప్రసాద్, ఉపాధ్యక్షుడు వరికూటి సుబ్బరాయడు, కార్యదర్శి వన్నెంపల్లి వెంకటేషు, సూర్యుడు, సురేష్, వెంకట రమణ, జగతి వెంకట సుబ్బయ్య, నాగేశ్వరరావు, మజ్జారి లక్ష్మీనారాయణ, మజ్జారి వెంకటరమణ, కులపెద్దలు, ప్రముఖులు పాల్గొన్నారు.


