● 6513.07 ఎకరాలకు...
జిల్లా వ్యాప్తంగా 6513.07 ఎకరాలకు సంబంధించి రూ. 13.02 కోట్లు సాయాన్ని మంజూరు చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం శఠగోపం పెట్టింది. పేరుకేమో ఉల్లి రైతులందరికీ ప్రోత్సాహక సాయం అందించామని గొప్పలు చెబుతోంది. చాలా మంది రైతులు అటు పంట పెట్టుబడులు రాక.. ఇటు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందక దిగాలు పడుతున్నారు. తాము రైతులం కాదా తాము ఉల్లిపంటను సాగు చేయ లేదా ప్రశ్నించడంతోపాటు కూటమి సర్కార్‌కు ఎందుకింత వివక్ష అని మండిపడుతున్నారు. ఈ విషయమై రైతు సంఘ నాయకులు పంట ప్రొత్సాహకం రాని రైతులతో కలిసి కలెక్టరేట్‌ను ముట్టడించేందుకు సయామత్తం అవుతున్నట్లు తెలిసింది.


