కొనసాగుతున్న కాంట్రాక్టు గెస్ట్ ఫ్యాకల్టీల నిరసన
వేంపల్లె : ఆర్జీయూకేటీ పరిధిలో 2018 నుంచి ఇప్పటివరకు పనిచేస్తున్న కాంట్రాక్ట్ గెస్ట్ ఫ్యాకల్టీకి నయా పైసా వేతనం పెంచకుండా ఉన్నతాధికారులు వెట్టి చాకిరి చేయించుకుంటున్నారని కాంట్రాక్ట్ గెస్ట్ ఫ్యాకల్టీ అధ్యాపకుల అసోసియేషన్ ప్రెసిడెంట్ నజీర్ హుస్సేన్ మండిపడ్డారు. ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ అకాడమిక్ బ్లాక్–1 ఎదుట శనివారం మూడవ రోజు చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలిపారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం ఆర్జీయూకేటీ ఉన్నతాధికారులతో చర్చించి సమాన పనికి సమానవేతనం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో నారాయణ, బిట్టు విజయ్, వేంపల్లె శ్రావణి తదితర గెస్ట్ ఫ్యాకల్టీ అధ్యాపకులు పాల్గొన్నారు.


