వైభవంగా సీతారాముల పౌర్ణమి కల్యాణం
ఒంటిమిట్ట : ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో శనివారం పౌర్ణమి సందర్భంగా ఉదయం 9:30 గంటల నుంచి సీతాసమేతుడైన శ్రీ కోదండ రాముడి కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని కల్యాణ వేదిక వద్ద అర్చకులు సీతారాముల ఉత్సవ విగ్రహాలను ఆశీనులు చేసి, నూతన పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం సతీసమేతుడైన శ్రీ కోదండ రామస్వామికి ఆలయ అర్చకులు శ్రావణ్ కుమార్, పవన్ కుమార్‌లు అంగరంగ వైభవంగా పౌర్ణమి కల్యాణం నిర్వహించారు. స్వామి వారి కల్యాణాన్ని వీక్షించేందుకులు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం
ఒంటిమిట్ట : ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శనివారం శాస్త్రోక్తంగా మూలవిరాట్‌లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ముందుగా అర్చకులు మూల విరాట్‌కు పంచామృతాభిషేకం నిర్వహించి, టీటీడీ అధికారులు తీసుకొచ్చిన నూతన పట్టువస్త్రాలు, పూలు, పండ్లతో ఆలయ ప్రదక్షిణ చేసి, గర్భాలయంలోని మూల విరాట్‌కు సమర్పించారు. నూతన పట్టువస్త్రాలను తొడిగి, బంగారు ఆభరణాలు వేసి, తులసి గజమాలలతో సుందరంగా అలంకరించారు. అనంతరం సీతారామలక్ష్మణ మూర్తులకు ప్రత్యేక పూజలతో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. శనివారం కావడంతో స్వామి వారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు.
రాజంపేటలో చైన్‌స్నాచింగ్
రాజంపేట : పట్టణంలోని నూనివారిపల్లెలో బీవీఎన్ పాఠశాల సమీపంలోని రాములవారి ఆలయం వద్ద శనివారం నీలపూజి జ్యోతి అనే మహిళ మెడలో నుంచి దుండగుడు సరుడు లాక్కొ వెళ్లాడు. ఈ మేరకు బాధితురాలు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సరుడు రోల్డ్‌గోల్డ్ అయినప్పటికి అందులో రూ.1.50 లక్షల విలువ చేసే బంగారు పుస్తెలు ఉన్నాయని బాధితురాలు తెలిపారు. పల్సర్‌బైక్‌పై వచ్చిన దుండగుడు చైన్‌ను గట్టిగా లాగడంతో మహిళ మెడకు గాయమైంది. థైరాయిడ్ కారణంగా ఇటీవలే ఆమె గొంతుకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. దొంగతనం జరిగిన ప్రదేశంలో సీసీ కెమెరాలు లేకపోవడం గమనార్హం. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
వైభవంగా సీతారాముల పౌర్ణమి కల్యాణం
వైభవంగా సీతారాముల పౌర్ణమి కల్యాణం


