రిమ్స్ మార్చురీలో వృద్ధుడి మృతదేహం
కడప అర్బన్ : కడప నగర శివార్లలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్)లో చికిత్స పొందేందుకు గుర్తు తెలియని వృద్ధుడు చేరాడు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. వృద్ధుని మృతదేహాన్ని రిమ్స్ మార్చురీలో వుంచారు. అతని వివరాలు తెలిసిన వారు తగిన ఆధారాలతో తమను సంప్రదిస్తే మృతదేహాన్ని అప్పగిస్తామని రిమ్స్ అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
ఇద్దరికి గాయాలు
పెద్దతిప్పసముద్రం : మండలంలోని పోతుపేట సమీపంలో ఉన్న యం.పార్లపల్లి మిట్ట వద్ద శనివారం ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ప్రమాదవశాత్తు ఢీకొన్నాయి. ఈ ఘటనలో తుమ్మరకుంట పంచాయతీ బొమ్మకపల్లికి చెందిన వెంకటేష్ (46), అభిషేక్ (22) గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం బి.కొత్తకోట సీహెచ్‌సీలో ప్రథమ చికిత్స చేయించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం మదనపల్లికి తరలించినట్లు గ్రామస్తులు తెలిపారు.
ఖైదీల ఆరోగ్యం,
సంక్షేమంపై దృష్టి
కడప అర్బన్ : ఖైదీల ఆరోగ్యం, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ ఎస్.బాబా ఫకృద్దీన్ పేర్కొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ సి.యామిని, సూచనల మేరకు ఆయన తమ సిబ్బందితో కలిసి శనివారం కడప పురుషుల కేంద్ర కారాగారం, ప్రత్యేక మహిళా కారాగారాలను, సందర్శించారు. ఈ సందర్భంగా ఖైదీ లతో మాట్లాడి వారి కేసు వివరాలను, ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఉచిత న్యాయ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు, అనంతరం జైలు పరిసరాలను పరిశీ లించి తగు సూచనలను ఇచ్చారు. మానసిక వ్యా ధులతో బాధపడే ఖైదీల ఆరోగ్య విషయాల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని సకాలంలో మందులను వాడాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పురుషుల, ప్రత్యేక మహిళ కారాగారముల సూపరింటెండెంట్లు, ప్యానల్ న్యాయవాదులు, పారా లీగల్ వలంటీర్లు, ఖైదీలు పాల్గొన్నారు.
రిమ్స్ మార్చురీలో వృద్ధుడి మృతదేహం


