నర్సింగ్ సూపరింటెండెంట్‌గా పదోన్నతులు
కడప రూరల్: వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయం జోన్–4 కార్యాలయంలో శుక్రవారం హెడ్ నర్స్ నుంచి నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ –2గా పదోన్నతులు కల్పించారు. రాయలసీమ జిల్లా వ్యాప్తంగా మొత్తం 9 మంది పదోన్నతులు పొందారు. ఈ సందర్భంగా ఆ శాఖ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ రామగిడ్డయ్య మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలు, ఉద్యోగుల అర్హతల ప్రకారం పదోన్నతులు కల్పించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ నాగరత్నమ్మ, ఆఫీసు సూపరిండెంట్ శ్రీనివాసులు, సీనియర్ అసిస్టెంట్ వనిష తదితరులు పాల్గొన్నారు.
జీజీహెచ్ గ్రేడ్–2 నర్సింగ్
సూపరింటెండెంట్‌గా గౌరి
కడప అర్బన్: కడప నగర శివారులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్)లో గ్రేడ్–2 నర్సింగ్ సూపరింటెండెంట్‌గా గౌరిని నియమించారు. ఈమె 1986లో చిత్తూరు జిల్లా బంగారుపాళెం పిహెచ్‌సీలో స్టాఫ్ నర్సుగా విధుల్లో చేరారు. అప్పటి నుంచి పచ్చికాపాలెం పీహెచ్‌సీలో విధులు నిర్వహించారు. శుక్రవారం జరిగిన గ్రేడ్–2 నర్సింగ్ సూపరింటెండెంట్ పదోన్నతుల నియామకంలో భాగంగా కడప జీజీహెచ్‌లో హెడ్‌నర్సులుగా పని చేస్తున్న గౌరి, మనోథెరిస్కోవా, ప్రిస్కిల్లాలకు గ్రేడ్–2గా పదోన్నతులను కల్పించారు. వీరీలో గౌరిని జీజీహెచ్ గ్రేడ్–2గాను, మనోథెరిస్కోవాను కడప కేన్సర్ కేర్ హాస్పిటల్, ప్రిస్కిల్లాను నంద్యాలలో నియమించారు.


