జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు క్రీడాకారులు ఎంపిక
పులివెందుల రూరల్ : గతనెలలో అన్నమయ్య జిల్లా కలికిరిలో రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్ అండడర్–14 బాలుర, బాలికల హ్యాండ్‌బాల్ పోటీలలో పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లె జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు ప్రతిభచాటి జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపికయ్యారు. బాలుర విభాగంలో పాఠశాలకు చెందిన అన్వర్, వెంకట వివేకానంద, బాలికల విభాగంలో ఖైరూన్, మౌనిక ఎంపికయ్యారు. ఎంపికై న వీరు ఈనెల 5 నుండి 10తేదీ వరకు రాజస్థాన్ రాష్ట్రంలో చిత్తూర్గడ్‌లో జరిగే జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలలో పాల్గొంటారు. ఈ విద్యార్థులను హెడ్మాస్టర్ రవిచంద్రారెడ్డి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు.
ఎస్.అన్వర్, వెంకట వివేకానంద, మౌనిక, ఖైరూన్
జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు క్రీడాకారులు ఎంపిక
జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు క్రీడాకారులు ఎంపిక
జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు క్రీడాకారులు ఎంపిక