6న అండర్ –14 బాలుర టాలెంట్ స్పాటింగ్ ఎంపికలు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ఈ నెల 6,7 తేదీల్లో అండర్ –14 పురుషుల టాలెంట్ స్పాటింగ్ ఎంపికలు జరగనున్నట్లు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఏ. రెడ్డి ప్రసాద్ తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు ఈ ఎంపికలకు హాజరుకాెవాలన్నారు. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు తమతోపాటు ఆధార్ కార్డు కాపీ, బర్త్ సర్టిఫికెట్(ఫారం 5) సర్టిఫికెట్ మరియు బర్త్ ప్లేస్ సర్టిఫికెట్ తో పాటు ఒక పాస్ పోర్ట్ సైజ్ ఫోటో ఒరిజినల్ తో పాటు ఒక ెసెట్ జిరాక్స్ తో పాటు తమ కిట్ బ్యాగులు కూడా తీసుకురావాల్సిందిగా కోరారు. ఈ ఎంపికలు ఉదయం 8 గంటలకు కడప మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్నామన్నారు. ఇందులో సెలెక్ట్ అయిన క్రీడాకారులను ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నామన్నారు. ఇదివరకు ఎప్పుడూ జిల్లా స్థాయిలో ఆడకుండా ఉండేవాళ్లు ఎంపికలకు రావాల్సిందిగా కోరారు. ఈ ఎంపికలకు అండర్– 14 కట్ ఆఫ్ డేట్ 2011 సెప్టెంబర్ 1 తర్వాత జన్మించిన వారు అర్హులన్నారు. ఎంపికలకు వచ్చే క్రీడాకారులు తెల్లటి దుస్తులతో హాజరుకావాలన్నారు.
ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరుకు వచ్చిన మున్సిపల్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ (అనంతపురం) జి.నాగరాజు శుక్రవా రం మున్సిపల్ పెట్రోలు బంకు బకాయిలపై జూనియర్ అసిస్టెంట్ ప్రవీణ్ కుమార్‌ను విచారించారు. మున్సిపాలి టీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ పెట్రోలు బంకుకు సంబంధించి సదరు ఉద్యోగి వివిధ రకాల ట్రావెల్స్ యజమానులకు డీజల్‌ను అప్పుగా ఇచ్చాడు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండానే ఉద్యోగి సొంత నిర్ణయంతో రూ.1.23 కోట్లు మేర అప్పు ఇచ్చినట్లు తెలుస్తోంది. 2022 నుంచి ఈ బకాయిలు ఉండగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బకాయిలు మరింత రెట్టింపు అయ్యాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లడం పత్రికల్లో వార్తలు రావడం జరిగింది. ఈ విషయంపై మున్సిపల్ ఆర్డీ నాగరాజు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్డీ విలేకరులతో మాట్లాడుతూ పెట్రోలు బంకుకు సంబంధించి అనధికారికంగా ఇప్పటి వరకు రూ.17లక్షలు వసూలైనట్లు తెలిసిందన్నారు. కమిషనర్ ప్రస్తుతం అందుబాటులో లేరని అన్నారు. విచారణ అనంతరం ప్రవీణ్‌కుమార్‌కు సంబంధించిన బ్యాంక్ లావాదేవీలను పరిశీలించి ఏమేరకు అవినీతి జరిగిందన్నదానిపై సీడీఎంఏకు లిఖిత పూర్వకంగా నివేదిక ఇస్తామన్నారు. మూతపడిన లక్ష్మీ ట్రావెల్స్‌కు రూ.31లక్షలు డీజిల్ అప్పు ఇచ్చిన వ్యవహారంపై ఆరా తీస్తున్నామన్నారు. కాగా మున్సిపల్ పెట్రోలు బంకులో జరిగిన అవకతవకలపై న్యాయవాది గోసంగి వెంకటసుబ్బారెడ్డి శుక్రవారం మున్సిపల్ ఆర్డీ నాగరాజును కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం మున్సిపల్ ఆర్డీ నాగరాజు పట్టణ శివారులో ఉన్న సేంద్రీయ ఎరువుల తయారీ కేంద్రాన్ని పరిశీలించారు.
రహదారి మాసోత్సవాలను జయప్రదం చేయాలి
కడబప వైఎస్‌ఆర్ సర్కిల్ : ఈ నెల 1 నుంచి 31 వరకు నిర్వహిస్తున్న జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు జయప్రదం చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మంత్రి క్యాంప్ కార్యాలయంలో 37 వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జ్ ఉప రవాణా కమిషనర్ వీర్రాజు పాల్గొన్నారు.
జాతీయ పోటీలకు సిద్ధం
జమ్మలమడుగు/ జమ్మలమడుగు రూరల్ : ఈనెల 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యే జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు సర్వం సిద్ధం చేసినట్లు వాలీబాల్ ఆర్గనైజింగ్ కమిటీ సెక్రెటరీలు ప్రసాద్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డిలు పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని ముద్దనూరు రోడ్డులో ఉన్న బాలికల జూనియర్ కాలేజిలో జాతీయ స్థాయి వాలీబాల్ పోటీల నిర్వహణకు పూర్తి స్థాయిలో సిద్ధం చేశామని శనివారం ఉదయం జిల్లా స్థాయి అధికారులతో ఆర్గనైజింగ్ కోఆర్డినేషన్ సమావేశాన్ని నిర్వహించనున్నామన్నారు. ఈనెల 5వ తేదీ నుంచి జాతీయ స్థాయి స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యే వాలీబాల్ పోటీలకు దేశ వ్యాప్తంగా 30 టీంలు వస్తున్నాయని వారు తెలిపారు.
6న అండర్ –14 బాలుర టాలెంట్ స్పాటింగ్ ఎంపికలు


