ప్రపంచ తెలుగు మహాసభలకు జిల్లా కవులకు ఆహ్వానం
పులివెందుల టౌన్ : జిల్లా కవులు పులివెందులకు చెందిన అల్లం రంగనాయకులు, బద్వేల్ నియోజకవర్గం పోరుమామిళ్లకు చెందిన బొల్లు రామ్మోహన్‌లకు గుంటూరులో ఈనెల 3, 4, 5వ తేదీలలో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలలో ప్రతినిధులుగా పాల్గొనేందుకు ఆహ్వానం లభించింది. ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో డాక్టర్ గజల్ శ్రీనివాస్ నిర్వహణలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు కడప జిల్లాకు చెందిన రాయల భువన విజయం వేదిక అధ్యక్షులు బొల్లు రామ్మోహన్, శ్రీకృష్ణదేవరాయ ఫౌండేషన్ చైర్మన్ అల్లం రంగనాయకులు రాయల్ లకు ఆహ్వానం లభించింది.
రిమ్స్ మార్చురీలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
కడప అర్బన్ : కడప నగర శివార్లలోని ప్రభుత్వ ఆసుపత్రి(రిమ్స్)లో చికిత్స పొందేందుకు వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి (40) మృతి చెందడంలో మార్చురీలో వుంచారు. అతనికి సంబంధించిన బంధువులు ఎవరైనా వుంటే తగిన ఆధారాలతో తమను సంప్రదించాలని రిమ్స్ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.
ఆలయ నిధుల దుర్వినియోగంపై చర్యలు ఎప్పుడు..?
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక అగస్త్యేశ్వరస్వామి ఆలయంలో నిధుల స్వాహా చేసిన వారిపై చర్యలు ఎప్పుడు తీసుకుంటారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. స్వామివారి ఆభరణాల గోల్‌మాల్‌పై ఇటీవల దేవాదాయశాఖ రీజనల్ జ్యువెలరీ ఇన్‌స్పెక్టర్ పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో స్వామివారి ఆభరణాలను తనిఖీ చేశారు. 16.400 గ్రాముల బంగారు హారం, 253.900 గ్రాముల వెండి గొలుసు కనిపించం లేదని తనిఖీలో నిర్ధారించారు. ఆలయ అధికారులు అడ్జస్ట్‌మెంట్ పేరుతో చెక్కులు జారీ చేసి దాదాపు రూ.కోటి వరకు నిధులు స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నిధుల స్వాహాపై దేవాదాయశాఖ అధికారులు ఎప్పుడు విచారణ జరుపుతారు, ఎప్పుడు చర్యలు తీసుకుంటారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. నిధుల దుర్వినియోగంపై త్వరలో కోర్టులో కేసు వేయనున్నట్లు ఆలయ చైర్మన్ వంగల నారాయణరెడ్డి తెలిపారు. కాగా స్వామివారి ఆభరణాల మాయంపై గత కొన్ని సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఈఓలుగా పనిచేసిన వారిని కర్నూలులో శుక్రవారం దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ గురుప్రసాద్ విచారణ చేశారు.
ఉపాధ్యాయులపై
ఒత్తిడి తగ్గించాలి
కడప ఎడ్యుకేషన్ : పదవ తరగతికి సంబంధించి వందరోజుల ప్రణాళిక పేరుతో, ప్రాథమిక ఉపాధ్యాయులకు ఎఫ్‌ఎల్‌ఎన్ పేరుతో తీవ్ర ఒత్తిడి గురిచేస్తున్నారని, విద్యాశాఖ మంత్రి వెంటనే ఉపాధ్యాయుల కు ఉపశమనం కలిగించాలని లేనిపక్షంలో విద్యాశాఖ కార్యాలయాలను ముట్టడించేందుకు వెనుకాడమని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షులు మల్లు రఘునాథరెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం వైఎస్సార్‌జిల్లా పోట్లదుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మెటీరియల్‌ను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం జిల్లా శాఖ చా లా ఉన్నత పాఠశాలలల్లో 10వ తరగతి మెటీరియల్‌ను ఉచితంగా అందిస్తోందన్నారు.
అల్లం రంగనాయకులు బొల్లు రామ్మోహన్
ప్రపంచ తెలుగు మహాసభలకు జిల్లా కవులకు ఆహ్వానం
ప్రపంచ తెలుగు మహాసభలకు జిల్లా కవులకు ఆహ్వానం


