క్రీడల్లో రాణించినపుడే వ్యక్తిత్వం వికసిస్తుంది
కమలాపురం : విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించినపుడే వ్యక్తిత్వం వికసిస్తుందని భారతి సిమెంట్ కార్పోరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (బీసీసీపీఎల్) చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ అతుల్ ప్రియదర్శి తెలిపారు. శుక్రవారం మండలంలోని నల్లలింగాయపల్లెలో వెలసిన డీఏవీ భారతి విద్యా మందిర్‌లో ప్లాంట్ హెడ్ రామ మూర్తి ఆధ్వర్యంలో ఇంటర్ హౌస్ స్పోర్ట్స్ ఫెస్ట్ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అతుల్ ప్రియదర్శి మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తా యన్నారు. అలాగే ఓటమిని తట్టుకునే ధైర్యం, జట్టుగా పని చేసే నాయకత్వ లక్షణాలను అలవర్చుతాయని పేర్కొన్నారు. హెడ్ ప్లాంట్ రామ మూర్తి మాట్లాడుతూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి డీఏవీ భారతి విద్యా మందిర్ ఎల్లప్పుడూ ప్రాధాన్యత నిస్తుందన్నారు. అందులో భాగంగానే ప్రతి ఏడాది ఇలాంటి క్రీడా సంబరాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ క్రీడోత్సవంలో క్రికెట్, వాలీబాల్, త్రోబాల్, రిలే రేస్, షాట్‌పుట్ వంటి వివిధ క్రీడా పోటీలు నిర్వహించగా విద్యార్థులు ప్రతిభను చాటారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏడీవీ రీజనల్ ఆఫీసర్ వీఎన్ శేషాద్రి, హెచ్‌ఆర్ హెడ్ గోపాల్‌రెడ్డి, చీఫ్ మేనేజర భార్గవ్ రెడ్డి, పాఠశాల ప్రిన్సిపల్ శివ్వం కిషోర్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.


