రాష్ట్రస్థాయి పోటీలలో డీసీసీ బ్యాంక్ ఉద్యోగుల సత్తా
కడప అగ్రికల్చర్ : రాష్ట్రస్థాయిలో గత నెల 27,28 తేదీలలో సహకార ఉత్సవ్–3లో భాగంగా గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో ఆప్కాబ్, సహకార శాఖలు నిర్వహించిన క్రీడా పోటీలలో కడప డీసీసీ బ్యాంకు ఉద్యోగులు సత్తా చాటారని ఆ బ్యాంక్ ఓఎస్‌డీ గుర్రప్ప తెలిపారు. ఈ సహకార క్రీడా పోటీలలో కడప డీసీసీ బ్యాంకు సిబ్బంది పలు పతకాలు సాధించారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప డీసీసీ బ్యాంకు ఏజీఎం చంద్రశేఖర్ 100 మీటర్ల పరుగు పందెంలో ప్రథమస్థానంలో, 400 మీటర్ల పరుగు పందెంలో స్టాప్ అసిస్టెంట్ ప్రేమకుమార్ ప్రథమస్థానంలో, 4్ఙశ్రీ100 రిలే పరుగు పందెంలో రెండవస్థానం, 4్ఙశ్రీ400 రిలే పరుగుపందెంలో ద్వితీయస్థానం, వాలీబాల్‌లో ద్వితీయస్థానం, చెస్‌లో ద్వితీయస్థానం, షటిల్ బాడ్మింటన్ వెటరన్ విభాగంలో తాను (ఓఎస్‌డి గుర్రప్ప) ప్రథమస్థానం సాధించానని తెలిపారు. మొత్తంపైన రాష్ట్రస్థాయిలో 4 ప్రథమస్థానం, 4 ద్వితీయస్థానాలను కై వసం చేసుకున్నామని తెలిపారు. విజేతలను శుక్రవారం కడప డీసీసీ బ్యాంకులో బ్యాంకు చైర్మెన్ మంచూరి సూర్యనారాయణరెడ్డి, సీఈఓ రాజామణి, ఓఎస్‌డి గుర్రప్ప, జీఎం ప్రతాప్‌రెడ్డి, డీజీఎంలు అభినందించారు.


