మేం అధికారంలోకి వస్తే మెడపట్టి గెంటేస్తాం
మెడికల్ కాలేజీ టెండర్లలో పాల్గొని ఎవరైనా వాటిని సొంతం చేసుకుంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఽధికారంలోకి వచ్చిన తర్వాత వారిని మెడపట్టి గెంటేస్తాం. విద్య, వైద్యం విషయంలో పేదలు దోపిడీకి గురికాకూడదనే మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. రూ.8500కోట్లతో వాటిని పూర్తి చేసేందుకు సంకల్పించారన్నారు. రూ.5వేల కోట్లు అయితే అన్ని కాలేజీలు పూర్తవుతాయి. చంద్రబాబు చేసే ప్రతి కార్యక్రమం కమీషన్ల కోసమే.. దౌర్జన్యంగా మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తే ఒప్పకునే ప్రసక్తేలేదు.
– ఎస్‌వీ సతీష్ కుమార్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాయలసీమ ఇన్‌చార్జి


