క్షయవ్యాధి నిర్మూలనకు సమష్టి కృషి
ఎర్రగుంట్ల : క్షయ వ్యాధికి అత్యాధునిక వైద్య చికిత్స అందుబాటులో ఉందని, ఽధైర్యంగా ముందుకు వచ్చి అవసరమైన చికిత్సను ఉచితంగా పొందవచ్చని ఎర్రగుంట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ పి.శ్రీనాథ్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని సుంకేసుల గ్రామంలో భారతి సిమెంట్ ఫ్యాక్టరీ సీఎస్‌ఆర్ సహకారంతో పెయిడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షయ వ్యాధి భయంకరమైన అంటువ్యాధి అన్నారు. ఈ వ్యాధి లక్షణాలు ఉన్న వారు వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆస్పుత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలన్నారు. భారతి సిమెంట్ ఫ్యాక్టరీ సీఎస్‌ఆర్ వింగ్ డి. మదన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం క్షయవ్యాధి సోకిందని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఈ వ్యాధి నిర్మూలనకు సమిష్టిగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పెయిడ్ సంస్థ అధ్యక్షుడు కె.నాగేశ్వరరెడ్డి, హెల్త్ సూపర్‌వైజర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


