చలి చంపేస్తోంది.!
కడప అగ్రికల్చర్ : మొన్నమొన్నటి వరకు వర్షాలతో ఇబ్బంది పడిన ప్రజలు తాజాగా చలితో వణికిపో తున్నారు. రాత్రి ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోయా యి. రాత్రి 8 గంటల నుంచి చలి మొదలై ఉదయం 9 గంటల వరకు చలి తీవ్రత అధికంగా ఉంటోంది. ఈ పరిస్థితి జిల్లాలో గత పది రోజుల నుంచి నెలకొంది. దీంతో జిల్లా ప్రజలు వణికిపోతున్నారు. మును పెన్నడూ లేని విధంగా చలి తీవ్రత పెరగడంతో వృద్ధులు, చిన్నారులతో పాటు ఉదయం పూట పనుల మీద వెళ్లే ప్రజలు చలికి గజగజలాడుతున్నారు. ఈ పరిస్థితి ఇంకెనాళ్లు కొనసాగుతుందోనని ఆందోళన చెందుతున్నారు.
కమ్ముకుంటున్న పొగమంచు..
ఒక పక్క చలి చంపుతుంటే మరో పక్క పొగమంచు కమ్మేస్తోంది. క్రమంగా పొగమంచు తగ్గినా చలి మాత్రం పంజా విసురుతోంది. దీంతో పనుల మీద బయటకు వెళ్లే రైతులు, రైతు కూలీలు, వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. వీరితోపాటు చిన్నపిల్లలు, వృద్ధులు కూడా అవస్థలు పడుతున్నారు. గతేడాది డిసెంబర్ మొదటి వారం వరకు వాతావరణం సాధారణంగానే ఉండేది. అలాంటిది ఈ ఏడాది డిసెంబర్‌లో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని చలి ప్రారంభమైంది.
సంక్రాంతికి మరింత పెరిగే అవకాశం..
ఈ చలి తీవ్రత జనవరి నెలలో మరింత పెరగనుంది. సాధారణంగా సంక్రాంతి సీజన్‌లో చలి అధికంగా ఉంటుంది. సంక్రాంతి పండుగకు చలి సంకలెత్తకుండా చంపుతుందని సామెత కూడా ఉంది. ఈ సామెత ఈ ఏడాది నిజమయ్యేలా కనిపిస్తోంది.
జిల్లాలో తగ్గిన ఉష్ణోగ్రతలు..
జిల్లా వ్యాప్తంగా నవంబర్ నెల 10వ తేదీ కనిష్ట ఉష్ణోగ్రత 25.3 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రత 32.8 డిగ్రీలు ఉండేది. అలాంటిది డిసెంబర్ 15వ తేదీ నాటికి కనిష్ట ఉష్ణోగ్రత 15.4 చేరగా గరిష్ట ఉష్ణోగ్రత 28.2 డిగ్రీలకు చేరింది. ఒక్కసారిగా ఉష్ణోగత్రల్లో మార్పు రావడంతో చాలా మంది జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు.
చలి దుస్తులకు పెరిగిన గిరాకీ..
చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో మధ్యప్రదేశ్ లోని భోపాల్ ప్రాంతానికి చెందిన కొందరు వ్యాపారులు కడప నగరంతోపాటు పలు ప్రాంతాలలోని రోడ్ల పక్క స్టాల్స్‌ను ఏర్పాటు చేసుకుని జోరుగా చలి దుస్తుల విక్రయాలను సాగిస్తున్నారు. ఈ స్టాల్స్‌లో చలికి సంబంధించిన స్వెట్టర్లు, రెయిన్‌కోట్లు, శాలువాలు, మంకీ క్యాపులు, గ్లౌజులు, రగ్గులు విక్రయిస్తున్నారు.
పెంపుడు జంతువులకు దూరంగా..
ఈ సీజన్‌లో పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలి. వైరస్‌ల వ్యాప్తికి పెంపుడు జంతువులు ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. ఈ కాలంలో వాటిని బెడ్‌రూమ్, వంటగదిలోకి రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వృద్ధులు, చిన్న పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు పెంపుడు జంతువులను దగ్గరలో లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది.
వేడి వస్తువులకు ప్రధాన్యం..
ఈ చలికాలంలో చల్లని వస్తువులకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీములకు మరింత దూరంగా ఉండాలి. గోరు వెచ్చని నీరు తాగితే కాసింత ఉపశమనం లభిస్తుంది. వీటికితోడు తాజా ఆహారం తీసుకుంటే మంచింది. ముఖ్యంగా ఈ చలికి చంటి బిడ్డలను బయటకు తీసుకెళ్లకూడదు.
చలితో గజగజ వణుకుతున్న
జిల్లా వాసులు
గత పది రోజుల నుంచి పెరిగిన
చలి తీవ్రత
సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు ప్రభావం
15 డిగ్రీలకు చేరిన రాత్రి ఉష్ణోగ్రతలు
తెల్లవారుజాము నుంచి రోడ్లను కమ్ముకుంటున్న పొగమంచు
ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
మారిన వాతావరణంలో
వివిధ అనారోగ్య సమస్యలు
జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు
దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు జాగ్రత్త..
ప్రస్తుతం ఉష్ణోగ్రతలు ఊహించని స్థాయిలో పడిపోతున్నాయి. గుండె జబ్బులు, బీపీ, ఆస్తమా, మధుమేహం వ్యాధిగ్రస్తులు ఈ చలికి జాగ్రత్తగా ఉండాలి. వీరు ముఖ్యంగా చలి తీవ్రంగా ఉన్న సమయాల్లో బయటకు వెళ్లకూడదు. సాధారణ ప్రజలకు కూడా జలుబు, దగ్గు, సీజనల్ జ్వరాలు పచ్చే అవకాశం ఉటుంది. ఒక వేళ బయటకు రావాల్సిన అవసరం ఏర్పడితే మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
– డాక్టర్ అవ్వారు అర్జున్‌కుమార్, రిమ్స్ వైద్యులు, కడప
చలి చంపేస్తోంది.!
చలి చంపేస్తోంది.!
చలి చంపేస్తోంది.!
చలి చంపేస్తోంది.!


