ఉద్యోగ,ఉపాధ్యాయుల పెండింగ్ డీఏలు చెల్లించాలి
కడప ఎడ్యుకేషన్ : రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన పెండింగ్ డీఏలను కూటమి ప్రభుత్వం వెంటనే చెల్లించాలని పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. కడపలోని సాయిబాబా స్కూల్‌లో ఆదివారం వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ కడప జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్‌రెడ్డి ఆధ్యర్యంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పశ్చిమ రాయలసీమ టీచర్స్ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి హాజరయ్యారు. సమావేశం ప్రారంభంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థ నిర్వీర్యం అవుతోందన్నారు. ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెండింగ్ డీఏలు చాలా ఉన్నాయన్నారు. వాటిని వెంటనే చెల్లించాలన్నారు. ప్రభుత్వం కొత్త పీఆర్సీ కమిషన్ వేసి ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫిట్మెంట్ ప్రకటించిందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు సీకే వెంకటనాథరెడ్డి, సజ్జల వెంకట రమణారెడ్డి, జిల్లా నాయకులు రమేష్‌బాబు, సురేష్‌రెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి, ఫరీదాబాను, మాజీ ఎంఈఓలు వీరారెడ్డి, జాపర్‌సాదిక్‌లతోపాటు పలువురు సంఘ నాయకులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌టీఎఫ్ కార్యవర్గ సమావేశంలో ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి


