వైఎస్సార్‌సీపీని బలీయమైన శక్తిగా మార్చాలి
● రాష్ట్రానికి ఆదర్శంగా కడప
పార్లమెంట్‌ను తయారు చేయాలి
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
పి.రవీంద్రనాథ్‌రెడ్డి వెల్లడి
కడప కార్పొరేషన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలీయమైన శక్తిగా తయారు చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన జిల్లా స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ అధికారం కోల్పోయినా ప్రజల్లోనే ఉంటూ.. వారి సమస్యల పరిష్కారానికి పోరాడే ఏకై క పార్టీ వైఎస్సార్‌సీపీయేనన్నారు. ఎంతో దూరదృష్టితో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేయిస్తే, చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో అమ్మేయాలని చూస్తోందన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నెల రోజులుగా పోరాటం చేస్తున్నామని, వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణకు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. లక్ష్యానికి మించి సంతకాలు సేకరించామని, ఈనెల 10వ తేది 4.80 లక్షలకు పైగా సంతకాల పత్రాలు జిల్లా కేంద్రానికి చేరాయన్నారు. 18వ తేదీలోపు అన్ని గ్రామ, మండల, జిల్లా కమిటీలను పూర్తి చేయాలన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక గ్రామ స్థాయిలో తీసుకున్న నిర్ణయాల మేరకు ప్రభుత్వ పాలన జరుగుతుందన్నారు. జగనన్న 2.0 ప్రభుత్వంలో కార్యకర్తలకు పెద్దపీట వేయడం జరుగుతుందన్నారు.
7 నియోజకవర్గాల్లో
95 వేల మందితో కమిటీలు
కడప పార్లమెంటు పరిశీలకులు కొండూరు అజయ్‌రెడ్డి మాట్లాడుతూ కడప పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 902 యూనిట్లకు కమిటీలు వేస్తే 95 వేల మంది కమిటీ సభ్యులు తయారవుతారన్నారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వజ్ర భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మందితో కమిటీలు వేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 21వ తేదీన అన్ని గ్రామాలు, వార్డులు, డివిజన్లలో రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఇందులో ముఖ్యంగా మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, స్థానిక సమస్యలపై మూడు తీర్మానాలు చేయాలన్నారు. ఆ రోజు 10 గంటలకు ఈ కార్యక్రమాలు ప్రారంభించేలా నియోజకవర్గ సమన్వయకర్తలు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ రఘురామిరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పి. రామసుబ్బారెడ్డి, డీసీ గోవిందరెడ్డి, ఎంవీ రామచంద్రారెడ్డి, మేయర్ పాకా సురేష్ కుమార్, సీఈసీ మెంబర్ ఏ.మల్లికార్జునరెడ్డి, సంబటూరు ప్రసాద్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీని బలీయమైన శక్తిగా మార్చాలి


