ప్రశాంతంగా ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష
కడప ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్ష(ఎన్‌ఎంఎంఎస్) ప్రశాంతంగా జరిగిందని డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా కడప, బద్వేల్, జమ్మలమడుగు, పులివెందుల మండలాల్లో 14 పరీక్షా కేంద్రాలలో నిర్వహించిన ఈ ఎన్‌ఎంఎంఎస్ పరీక్షకు 2519 మంది విద్యార్థులకుగాను 2459 మంది హాజరయ్యారని డీఈఓ తెలిపారు.
కడప కార్పొరేషన్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 8 వతేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు డయల్ యువర్ ఏపీఎస్‌పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వినియోగదారులు మొబైల్ నంబరు 89777 16661కు కాల్ చేసి పెండింగ్‌లో ఉన్న తమ విద్యుత్ సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. ఈ సదవకాశాన్ని విద్యుత్ వినియోగదారులు సద్విని యోగం చేసుకోవాలని కోరారు.
కడప సెవెన్‌రోడ్స్: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించు కోవాలని డీఆర్వో విశ్వేశ్వర నాయుడు ఆదివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. అర్జీదారులు తమ అర్జీల సమాచారం తెలుసుకోవడానికి 1100 నెంబర్ కు కాల్ చేయవచ్చునన్నారు.
సభాభవన్‌లో పీజీఆర్‌ఎస్ నిర్వహణ
ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్)ను ఈ సోమవారం సభాభవన్‌లో నిర్వహించనున్నట్లు డీఆర్వో విశ్వేశ్వర నాయుడు తెలిపారు. అర్జీదారులు మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌లో అర్జీలు నమోదు చేసుకోవచ్చన్నారు. ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్) అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు మండల, మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తామని పేర్కొన్నారు.
డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం
డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని సోమ వారం ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు జరుగుతుందన్నారు.ప్రజలు 08562–244437 ల్యాండ్ లైన్ నెంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలను విన్నవించుకోవచ్చునన్నారు.
లక్కిరెడ్డిపల్లి: మండలంలోని శ్రీ అనంతపురం గంగమ్మను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారికి బోనాలు సమర్పించారు. తలనీలాలు అర్పించారు. గంగమ్మా..కాపావడమ్మా అంటూ వేడుకున్నారు. ఆలయ పూజారులు చెల్లు వంశీయులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
కడప కార్పొరేషన్: ఏపీ ఫార్మా కౌన్సిల్ ఎన్నికలకు జిల్లాలో ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భా గంగా కడప డీఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయంలో ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఏపీజీఏ జిల్లా అధ్యక్షుడు సిద్దయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఏపీజీఏ రాష్ట్ర అధ్యక్షుడు జి. కోటేశ్వరరావు, ఏపీపీఎస్‌ఎస్ ఫౌండర్ ఎం. సురేష్ బాబు ముఖ్య అతిథులుగా హాజరుకాగా, ఏపీపీసీకి యునై టెడ్ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ అసోసియేన్ నుంచి నామినేషన్ చేసిన లుక్కా. నరేష్, క్రిష్ణమరాజు, రాధాక్రిష్ణ, ప్రభుత్వ ఫార్మసిస్టులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు కోటేశ్వరరావు మాట్లాడారు. ఏపీ ఫార్మసీ సంక్షేమ సంఘం నుంచి లుక్కా. నరేష్,నాగక్రిష్ణమరాజు, రాధాక్రిష్ణ, ఐపీఏ నుండి కోలా శ్రావణ్,నల్లిమిల్లి ఆదిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫార్మసిస్ట్ అసోసియేషన్ నుంచి మాలతి నామినేషన్ వేశారని..ఈ ప్యానల్‌ను గెలిపించాలని కోరారు. ఏపీజీఏ జిల్లా అధ్యక్షులు డా.సిద్దయ్య మాట్లాడారు. జిల్లా అధ్యక్షులు ఉమామహేశ్వర్ రావు, చలపతి పాల్గొన్నారు.
ప్రశాంతంగా ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష


