‘సంతకమే’ సమరశంఖం
కొండాపురం/ముద్దనూరు: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను జిల్లా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమంలో భాగస్వాములవుతున్నారు. చంద్రబాబు దుర్మార్గపు పాలనకు సంతకంతో చెక్ పెట్టేందుకు ముందుకొస్తున్నారు. భవిష్యత్తు తరాల బాగు కోసం వైఎస్సార్‌సీపీ చేపట్టిన ఉద్యమానికి ఆదివారం కొండాపురం మండలం, మద్దనూరులో సంతకంతో మద్దతు తెలిపారు. ఈకార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. కొండాపురం మండలంలోని చామలూరు, కోడూరు, గ్రామాల్లో చంద్రబాబు ప్రభుత్వం చేపడుతున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆదివారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. మాజీ మార్కెట్‌యార్డ్ ఛేర్మెన్ కోడూరు శివారెడ్డి, జి. రామాంజనేయులురెడ్డి, నారాయణరెడ్డి, జి. శివారెడ్డి, వెంకటరెడ్డి, మళిఖార్జునరెడ్డి, పవన్ కుమార్‌రెడ్డి, చంద్ర ఓబుల్‌రెడ్డి, సంపంగి గోపాల్, నాగేంద్ర కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే ముద్దనూరు మండలంలోని చిన్నదుద్యాల గ్రామంలో పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలమేరకు పార్టీ మండల అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి కోటి సంతకల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌పరం చేయడం దారుణమని పార్టీ నాయకులు, కార్యకర్తలు పేర్కొన్నారు.
కొండాపురం: కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు, ముద్దనూరు: కోటిసంతకాల సేకరణలో పార్టీ అభిమానులు
కోటి సంతకాలకు విశేష స్పందన
‘సంతకమే’ సమరశంఖం


