బధిర ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
కడప ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ బధిర ఉద్యోగుల సంఘం వైఎస్సార్ కడప జిల్లా శాఖ నూతన కార్యవర్గాన్ని ఆదివారం కడపలోని డాక్టర్ వై.ఎస్.ఆర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇందులో ఏపీ బధిర ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఎం. శివ నాగ సంతోష్, అసోసియేట్ అధ్యక్షుడిగా ఎం.కొండయ్య రాజు, ఉపాధ్యక్షుడిగా పి. రాజశేఖర్ నాయుడు, ప్రధాన కార్యదర్శిగా డి.నరేంద్ర రెడ్డి, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా టి. భూ ప్రకాష్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా డి.జైహింద్ రెడ్డి, ట్రెజరర్‌గా ఎస్.మహేష్, మహిళా కార్యదర్శిగా ఎ.రెడ్డమ్మ, ఈసీ మెంబర్లుగా ఎస్.షబానా, కె.వి.సుబ్బారెడ్డి, ఎస్.గయాసు ద్దీన్‌లు ఎన్నికయ్యారు. ముఖ్య అతిథిగా జిల్లా ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షుడు బి. శ్రీనివాసులు, ఎన్జీఓ ఎలక్షన్ ఆఫీసర్ సి. సిద్ధయ్య, అసోసియేట్ ఎలక్షన్ ఆఫీసర్ వి.కుమార్, ఎన్నికల పరిశీలకుడిగా పి. నిత్యపూజయ్య పాల్గొన్నారు.


