
బాధితురాలికి ఐఫోన్ అప్పగింత
కడప అర్బన్ : కడప నగరం చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ కాలనీకి చెందిన బయనబోయిన కిరణ్ కుమారి ఈ నెల 28న బట్టలు కొనుగోలు చేయుటకు ఇంటి నుంచి షాపింగ్ మాల్ వెళుతుండగా, బ్రహ్మయ్య షెడ్ వద్ద తనకు చెందిన సుమారు రూ.80,000 విలువ గల ఐఫోన్ మొబైల్ పోగొట్టుకున్నది. ఈ విషయాన్ని ఆమె వెంటనే చిన్నచౌక్ పోలీస్‌స్టేషన్‌లో తెలియజేసినది. ఈ క్రమంలో ఆర్టీసీ కాలనీకి చెందిన ముత్యాలపాడు శ్రీరాములుకు బ్రహ్మయ్య షెడ్ వద్ద మొబైల్ ఫోన్ దొరకగా, దానిని బాధ్యతతో చిన్నచౌక్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి సీఐ ఓబులేసు, ఎస్‌ఐ రాజరాజేశ్వర రెడ్డికి అప్పగించాడు. అధికారుల సమక్షంలో ఐఫోన్‌ను కిరణ్ కుమారికి అప్పగించారు. తనకు దొరికిన మొబైల్ ఫోన్‌ను నిజాయితీతో స్టేషన్‌కు అందజేసిన శ్రీరాములును చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఓబులేసు, ఎస్‌ఐ రాజరాజేశ్వరరెడ్డి అభినందించారు.