
అంతిమ విజయం న్యాయానిదే
రాజకీయంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఎదుర్కోలేక కుట్రపూరితంగానే కూటమి సర్కార్ అక్రమ మద్యం కేసు పెట్టింది. మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు కావడం మంచి పరిణామం. వైఎస్సార్‌సీపీ శ్రేణులపై పెడుతున్న అక్రమ కేసులు ఎన్నో రోజులు నిలవవు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తగిన సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు బుద్ధిచెబుతారు. ఎవరెన్ని తప్పుడు కేసులు పెట్టినా అంతిమ విజయం న్యాయానిదే. – గడికోట శ్రీకాంత్‌రెడ్డి,
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి