
విన్నపాలు వినవలె !
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఫలితంగా బాధితులు పదేపదే వస్తున్నారు. కాగా సోమవారం జేసీ అదితిసింగ్ అర్జీదారుల సమస్యలను ఆలకించారు. వాటి పరిష్కారం కోసం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఫిర్యాదుల్లో కొన్ని..– కడప సెవెన్‌రోడ్స్
మా మామ పాలెం సుబ్బనరసింహులు పేరిట సర్వే నెంబరు 6/2బిలో 5.35 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని తనకు విక్రయించాలంటూ రెండేళ్లుగా మా గ్రామానికి చెందిన అధికార టీడీపీ నాయకుడు రామకృష్ణారెడ్డి ఒత్తిడి చేస్తున్నారు. మమ్మల్ని సాగు చేసుకోనివ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. ఆయనపై చర్యలు తీసుకుని మా భూమి మాకు దక్కేలా చర్యలు తీసుకోవాలి. –నరసింహారావు, దవంతరంపల్లె, ఒంటిమిట్ట మండలం
నేను బయనబోయిన నాగమల్లేశ్వరి నుంచి రెండు సెంట్ల 566 చదరపు లింకుల గునాదిగల స్థలా న్ని రూ. 8 లక్షలకు కొనుగోలు చేశాను. రిజిస్ట్రేషన్ కూడా జరిగింది. ఇప్పుడు ఎ.వెంకట సుబ్బయ్య అనే వ్యక్తి వచ్చి బుల్‌డోజర్‌తో గునాది ధ్వంసం చేశాడు. ఈ విషయాన్ని నేను నాగమల్లేశ్వరి దృష్టికి తీసుకెళ్లినా ఆమె సమాధానం ఇవ్వడం లేదు. ఈ విషయంపై సీకే దిన్నె పోలీసులు తహసీల్దార్ నివేదికను కోరారు. తహసీల్దార్ స్పందించడం లేదు. నాకు న్యాయం చేయాలని కోరేందుకు వచ్చాను. – షేక్ కలీమున్నీసా, సీకే దిన్నె
కర్నూలు జిల్లా మాదిరే అధిక వర్షాలకు నష్టపోయిన జిల్లాలోని ఉల్లి రైతులకు ప్రభుత్వం ప్రక టించిన రూ. 50 వేలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలి. అధికారులు ఈ జిల్లా రైతులకు ఈ సాయం అందదని అంటున్నారు. దీనిపై స్పందించి రైతులకు వివరణ ఇవ్వాలి. దెబ్బతిన్న ఖరీఫ్ పంటలకు బీమా, ప్రభుత్వం ద్వారా పరిహారం ఇప్పించాలని కోరుతున్నాం.– ఆదినారాయణరెడ్డి,మల్లారెడ్డి, జనార్దన్‌రెడ్డి, బీకేఎస్ నాయకులు
మా తోటలోని వంద చీనీ చెట్లను మా గ్రామానికి చెందిన అన్నవరం గోపాల్‌రెడ్డి అనే వ్యక్తి నరికి వేశారు. గ్రామ సర్వే నెంబరు 220/2బీ1, 2బీ2లలో మా అబ్బ కొండప్ప పేరిట 5.48 ఎకరాల భూమి ఉంది. ఇందుకు సంబంధించి ఈసీ, ఆర్‌ఎస్‌ఆర్, పాసుపుస్తకాలన్నీ ఉన్నాయి. మా భూమి పక్కనున్న గోపాల్‌రెడ్డి మా భూమిని కాజేయాలన్న కుట్రతో చీనీ చెట్లు నరికించి దౌర్జన్యానికి పాల్పడుతున్నాడు.
– రాము, గురిజాల గ్రామం, సింహాద్రిపురం

విన్నపాలు వినవలె !

విన్నపాలు వినవలె !

విన్నపాలు వినవలె !

విన్నపాలు వినవలె !