
డిగ్రీ ప్రవేశాలు డీలా!
● నేటికీ జారీకాని ప్రవేశాల నోటిఫికేషన్
● ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌పై స్పష్టత కరువు
● సింగిల్, డబుల్ మేజర్ సబ్జెక్టులపై సందిగ్ధం
● ప్రభుత్వ ప్రకటన కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదురు చూపు
కడప ఎడ్యుకేషన్: కూటమి ప్రభుత్వం ఉన్నత విద్యను నిర్లక్ష్యం చేస్తోంది. ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలై మూడు నెలలు దాటింది. జూలై మాసం కూడా ముగుస్తోంది. ఇంతవరకు డిగ్రీ ప్రవేశాల నోటిఫికేషన్ ఊసే లేకుండా పోయింది. దీంతో వేలాది మంది విద్యార్థుల్లో ఆందోళనలతోపాటు గందరగోళం నెలకొంది. జిల్లావ్యాప్తంగా దాదాపు 10 వేల మందికిపైగా విద్యార్థులు డిగ్రీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 2024–25 సీనియర్ ఇంటర్ ఫలితాల్లో 12878 మందికిగాను 9698 మందికిపైగా విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరితోపాటు పలువురు సప్లిమెంటరీ రాసి పాసైన వారు ఉన్నారు. వీరంతా డిగ్రీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు.
పూర్తి నిర్లక్ష్యం....
ఉన్నత విద్యపై కూటి సర్కార్ పూర్తిగా నిర్లక్ష్యం వహించింది.గతేడాది అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యంగా చేపట్టడంతో చాలా కళాశాలల్లో 40 నుంచి 50 శాతం సీట్లు మిగిలిపోయాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మరింత అలస్యంగా అడ్మిషన్ల పక్రియ ప్రారంభం కానుండటంతో ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్లు మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయి. జూన్ నెలలోనే పాఠశాలలు, ఇంటర్ కళాశాలలు ప్రారభమయ్యాయి, మరో వైపు డిగ్రీ కళాశాలలు కూడా నెల రోజుల క్రితమే పునః ప్రారంభమయ్యాయి. జిల్లాలో పలు ప్రెవేటు డిగ్రీ కళాశాలలు మాత్రం గుట్టుగా అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టి చప్పు డు కాకుండా తరగతులను నిర్వహిస్తున్నట్లు సమా చారం. అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యం చేయడం ద్వారా పేద, మద్య తరగతి విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ కళాశాలలు వెనకబడి పోతున్నాయి.
21న ప్రైవేటు డిగ్రీ కళాశాలలు బంద్
డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ అలసత్వంపై ప్రైవేటు డిగ్రీ కళాశాలల అసోసియేషన్ 21వ తేదీ ప్రైవేటు డిగ్రీ కళాశాల బంద్‌కు పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా డిగ్రీ ప్రవేశాలు పూర్తయి తరగతులు ప్రారంభమైనా ఏపీ ప్రభుత్వం విద్యా ప్రణాళిక కూడా తీసుకరాలేకపోతోందని ఆరోపించింది. ఇందుకు నిరసనగానే 21వ కళాశాల బంద్‌ను నిర్వహించి నిరసనను తెలియ చేయనున్నారు.
డిగ్రీ విద్యపై కుట్ర
డిగ్రీ విద్యార్థులతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది. సింగల్ మేజర్, డబుల్ మేజర్ అంటూ డిగ్రీ విద్యను నిర్వీర్యం చేసే కుట్ర చేస్తోంది. ఇంజనీరింగ్ విద్యను ప్రొత్సహించి డిగ్రీ చదువును నిర్లక్ష్యం చేస్తుంది. డిగ్రీ విద్యను పాత పద్దతిలో కొనసాగిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి ఇప్పుడు వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నారు. డిగ్రీ కోర్సులలో విద్యార్థులకు అభద్రతా భావం కల్పిస్తూ డిగ్రీ అడ్మిషన్లు తగ్గించే నిర్ణయాలు చేయడం తగదు. –ఎస్. వెంకటరమణ,
యోగివేమన ప్రైవేటు డిగ్రీ కాలేజీ యూనియన్ ప్రెసిడెంట్
డిగ్రీ ప్రవేశాలను వెంటనే చేపట్టాలి
విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ప్రవేశాలను ప్రారంభించపోవడం సరికాదు. తెలంగాణాతోపాటు పొరుగు రాష్ట్రాలలో సైతం నెల రోజుల క్రితమే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. కానీ మన దగ్గర అడ్మిషన్ల పక్రియ ఆలస్యమయింది. దీంతో డిగ్రీ చేరే విద్యార్థుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. ప్రభుత్వం వెంటనే డిగ్రీ ప్రవేశాలను ప్రారంభించాలి.
– వీరనాల శివకుమార్, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి
ఉన్నత విద్య నిర్వీర్యం
కూటమి ప్రభుత్వం తీరు చూస్తుంటే ఉన్నత విద్యను నిర్వీర్యం చేసేలా ఉంది. డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి ఇప్పటి వరకు నోటిఫికేషన్ జారీ చేయకపోవడం చాలా బాధాకరం. ప్రభుత్వ పెద్దల తీరుతో జిల్లావ్యాప్తంగా వేల మంది పేద, మద్య తరగతి విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం నెలకొంది. ఇప్పటికై నా ప్రభుత్వ పెద్దల్లో మార్పు రావాలి.
– సాయిదత్త, వైఎస్సార్ స్టూడెంట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు

డిగ్రీ ప్రవేశాలు డీలా!

డిగ్రీ ప్రవేశాలు డీలా!

డిగ్రీ ప్రవేశాలు డీలా!

డిగ్రీ ప్రవేశాలు డీలా!