● జీలుగలు 3308.7 టన్నులు కేటాయించగా.. ఇందులో 1967.8 టన్నులు మంజూరు చేయగా.. 1222 టన్నులు రైతులు తీసుకెళ్లారు.
● జనుములు 982.1 కేటాయించగా, ఇందులో 862.4 మంజూరు చేయగా 487.9 టన్నులను రైతులు తీసుకెళ్లారు.
● వేరుశనగ 3577 టన్నులు కేటాయించగా, 2718.6 మంజూరు చేయగా.. ఇందులో 2673.9 టన్నులు రైతులు తీసుకుని వెళ్లినట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు.
యూరియా దొరకడం లేదు
నేను ఐదు ఎకరాల్లో పత్తి పంట సాగు చేశా. ప్రస్తుతం యూరియా అవసరం ఉంది. యూరియా కొందామంటే దొరకడమే లేదు. ఒక వేళ దొరికితే.. యూరియాతోపాటు కాంప్లెక్స్ ఎరువులు కొనాలని డీలర్లు సూచిస్తున్నారు. – వెంకటసుబ్బయ్య, తుడమలదిన్నె, ఖాజీపేట
ఎరువుల రేట్లను పెంచడం అన్యాయం
రసాయనిక ఎరువుల రేట్లను పెంచడం చాలా అన్యాయం. ఎరువుల పెరుగుదల ప్రభావం వ్యవసాయంపైన తీవ్రంగా పడుతుంది. సాగుకు కౌలు రైతులు ముందుకు రాక, సొంత భూమి ఉండే రైతులు వ్యవసాయం చేయలేకపోతున్నారు. – సహదేవరెడ్డి,
భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు
40,390 మెట్రిక్ టన్నుల కేటాయింపు
2025 ఖరీఫ్ సీజన్‌లో ఏప్రి ల్ నుంచి జూలై వరకు 40930 మెట్రిక్ టన్నుల ఎరువులు జిల్లాకు కేటాయించారు. ఇందులో ఇప్పటికి 7146.3 మెట్రిక్ టన్నుల వివిధ రకాల కంపెనీల ఎరువులను జిల్లాకు సరఫరా చేశారు. – చంద్రానాయక్, జిల్లా వ్యవసాయ అధికారి
విత్తనం.. గగనం
విత్తనం.. గగనం
విత్తనం.. గగనం