
జర్నలిజం కోర్సులో నేరుగా ప్రవేశాలు
కడప ఎడ్యుకేషన్: యోగివేమన విశ్వవిద్యాలయంలో పోస్టు గ్రాడ్యుయేషన్ డిప్లమో కోర్సులలో ప్రవేశానికి ఈ నెల 21 నుంచి 31 తేదీ వరకు నేరుగా ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు యోగి వేమన విశ్వవిద్యాలయం ప్రవేశాల సంచాలకులు డాక్టర్ టి. లక్షీప్రసాద్ తెలిపారు.జర్నలిజం శాఖ ఆధ్వర్వంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ పబ్లిక్ రిలేషన్ (పీజీడీపీఆర్), పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ తెలుగు జర్నలిజం (పీజీడీటీజే), ఫైన్ ఆర్ట్స్ శాఖ ఆధ్వర్యంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లమా ఇన్ థియేటర్ ఆర్ట్స్ కోర్సులకు ప్రవేశాల కౌన్సెలింగ్ జరగనుందని తెలిపారు. పీజీ డిప్లొమా కోర్సులలో ప్రవేశానికి ఏదేని డిగ్రీ ఉత్తర్ణీత సాధించినవారు అర్హులని చెప్పారు. వివరాలకు www.yvu.edu.in ను సందర్శించాలని ఆయన సూచించారు.
నేడు ప్రజా ఫిర్యాదుల
పరిష్కార వేదిక
కడప సెవెన్‌రోడ్స్: ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను సోమవారం సభాభవన్‌లో నిర్వహిస్తున్నట్లు డీఆర్వో విశ్వేశ్వర నాయుడు తెలిపారు. అర్జీదారులు వారి అర్జీలు మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌లో అర్జీలు నమోదు చేసుకోవచ్చన్నారు.
● ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని డీఆర్వో విశ్వేశ్వరనాయుడు ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. తాము అందజేసిన అర్జీలు పరిష్కారం కాకపోయినా లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నెంబర్‌కు కాల్ చేయవచ్చన్నారు.
● డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 9.30 నుండి 10 గంటల వరకు జరుగుతుందన్నారు.ప్రజలు 08562– 244437 ల్యాండ్ లైన్ నెంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలను విన్నవించుకోవచ్చునన్నారు.
‘పాలకొండ’లో కోయిల్
ఆళ్వార్ తిరుమంజనం
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: శ్రావణమాసం ఉత్సవాల సందర్భంగా కడప నగర శివార్లలోని శ్రీ పాలకొండ్రాయస్వామి ఆలయంలో ఆదివారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. గర్భాలయం, అంతరాలయం,షోడశ మండపం, ఆలయ ప్రాంగణం, ప్రాకారపరిసరాలను ఆలయ సేవకులు, అధికారులు శుభ్రపరిచారు. ఆలయ పరిసరాలలో ఉన్నటువంటి చిన్న కోనేరు ,పెద్ద సెలయేరు, ఆలయ చుట్టుపక్కల పరిసరాలలో ఉన్నటువంటి అపరిశుభ్ర వ్యర్థాలను తొలగించి ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. కార్యక్రమంలో కడప నగరానికి చెందిన శ్రీ భువనేశ్వరి మాత సేవా సమితి సేవకులు, శ్రీ సుముఖీ అన్నపూర్ణేశ్వరి సేవా సమితి సభ్యులు,ఆలయ అర్చకులు యోగేశ్వర శర్మ, ఆలయ చైర్మన్ రెడ్డయ్య యాదవ్, స్వామివారి భక్తులు పాల్గొన్నారు.
పిల్లల్లో ఎదుగుదల
లోపాలపై నిర్లక్ష్యం తగదు
కడప కోటిరెడ్డిసర్కిల్: పిల్లల్లో ఎదుగుదల లోపాలను ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదని, ఈ విషయంగా నిర్లక్ష్యం తగదని ప్రముఖ చైల్డ్ సైకాలజిస్ట్ సోమశేఖర్ తెలిపారు. ఆదివా రం కడప పట్టణంలోని ఐఎంఏ హాలులో ఆర్టి జం స్పెక్ట్రం డిసార్డర్ అనే అంశంపై అషూర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం ఆటిజం పిల్లలకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 నెలలు నిండిన వెంటనే పిల్లల ప్రవర్తన, ఎదుగుదల, మాటలు వంటి వాటిని తల్లిదండ్రులు పరిశీలించాలని, ఏమాత్రం తేడా ఉన్న వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ అర్జున్ , రిమ్స్ పీడియాట్రిక్ హెచ్ ఓ డి డాక్టర్ వంశీధర్, ప్రముఖ చిన్న పిల్లల వైద్యులు ఓబుల్ రెడ్డి మాట్లాడా రు. రత్న స్పీచ్ అండ్ హియరింగ్ సెంటర్ స్పీచ్ థెరపిస్టులు బాబురావు, ప్రవల్లిక అషుర్ సంస్థ ప్రతినిధులు న్యాయవాది కిషోర్ కుమార్, నాగరాజు, జయరాజు తదితరులు పాల్గొన్నారు.

జర్నలిజం కోర్సులో నేరుగా ప్రవేశాలు