
● తరాలు మురిసేలా–సంస్కృతి వెలిగేలా..
తరతరాలు మురిసి పోయేలా సంస్కృతి వెలిగేలా ఆలయ పునర్నిర్మాణ పనులు గండిలో చేపట్టారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక గండిని టీటీడీలో విలీనం చేయించి ఎంతో అభివృద్ధి చేశారు. అలాగే గత ముఖ్య మంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గండి ఆలయం పునర్ని ర్మానానికి రూ.28 కోట్ల మేర నిధులు మంజూరు చేయించారు. ఈనిధులతో ఆలయ పునర్నిర్మాణ పనులు సుమారు 95శాతం మేర పూర్త య్యాయి. ఆలయాన్ని పూర్తిగా కృష్ణశిల రాయితోనే నిర్మిస్తున్నారు. ఆల యంలో భక్తులు అడుగు పెట్టగానే దైవత్వం ఉట్టి పడేలా తరాలు మురిసి పోయి సంస్కృతి ఉట్టిపడుతూ చరిత్రలో నిలిచి పోయేలా ప్రతి రాయిపైనా పలు దేవతా మూర్తుల బొమ్మలు చెక్కించారు. ఆలయం నిర్మాణంలో ఉండటంతో ఇక్కడ బాలాలయం నిర్మించి ధారువుతో చేయించిన స్వామి విగ్రహాన్ని ఉంచి పూజలు చేయిస్తున్నారు.