
నిందితులకు వైద్య పరీక్షలు
తొండూరు : ఇటీవల సైదాపురం బస్టాప్ సమీపంలో జరిగిన దాడి కేసులో నిందితులైన తొండూరు మండలం ఇనగలూరు గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. దాడి కేసుకు సంబంధించి ఐదుగురు నిందితులను బుధవారం పోలీసులు రిమాండ్‌కు పంపారు. జడ్జి ఎదుట పోలీసులు తమను చితకబాదారని నిందితులు వాపోయారు. దీంతో జడ్జి నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. నేపథ్యంలో పులివెందుల ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి నివేదికను కోర్టుకు అందించనున్నట్లు తెలిసింది.
సినిమా థియేటర్ వద్ద ఘర్షణ
కడప అర్బన్ : డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ కథా నా యకుడిగా నటించిన హరహర వీరమల్లు చలనచిత్రం ఈనెల 23న రాత్రి ప్రీమియం షో విడుదల చేశారు. ఈ సినిమా విడుదల సందర్భంగా బుధవారం రాత్రి కడప నగరంలోని రాజా (రహత్) సినిమా థియేటర్ వద్ద అభిమానుల మధ్య జరిగిన వాగ్వాదం కాస్త ఘర్షణకు దారి తీసింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి ఘర్షణను సద్దుమణిగేలా చేశారు.

నిందితులకు వైద్య పరీక్షలు