ప్రభుత్వం చేసిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం చేసిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలి

Jul 25 2025 4:50 AM | Updated on Jul 25 2025 4:50 AM

ప్రభుత్వం చేసిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలి

ప్రభుత్వం చేసిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలి

కడప కార్పొరేషన్‌ : కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 14 మాసాల్లో ఎన్ని అప్పులు చేశారో, అవి దేనికి ఖర్చు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టి ఈ ప్రభుత్వం రూ.1.86 లక్షల కోట్ల అప్పులు చేసిందన్నారు. ఎన్నికల్లో పచ్చి అబద్ధాలు చెప్పి, ప్రజలకు బాండ్లు ఇచ్చి ఓట్లు దండుకొని ఇప్పుడు మోసం చేస్తున్నారన్నారు. అన్నీ లెక్కలేసుకున్నాం...ప్రతి పథకమూ అమలు చేస్తాం...అలా చేయకపోతే చొక్కా పట్టుకొని నిలదీయాలని చంద్రబాబు, లోకేష్‌ చెప్పారన్నారు. ఇప్పుడు వారిని చొక్కాపట్టుకొని నిలదీసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ‘బాబు ష్యూరిటీ, మోసం గ్యారెంటీ’ కార్యక్రమంలో ఇంటింటికీ తిరుగుతున్న సమయంలో ఈ ప్రభుత్వానికి ఓటేసి మోసపోయామని ప్రజలు ఆవేధన వ్యక్తం చేస్తున్నారన్నారు. ఆడబిడ్డ నిధి పథకం అమలు చేస్తే ఆంధ్రాను అమ్మేయాలని అచ్చెన్నాయుడు చెప్పడాన్ని బట్టి చూస్తే ఆ పథకం అమలు చేసే ఉద్దేశం లేదని అర్థమవుతోందన్నారు. వైఎస్సార్‌సీపీ చేసిన ఉద్యమాల వల్లే ‘తల్లికి వందనం’ అరకొరగా అమలు చేశారన్నారు. ఇంకా చాలా మంది అర్హులైన తల్లులకు డబ్బులు పడలేదన్నారు. 20లక్షల ఉద్యోగాలు ఇస్తామని, నిరుద్యోగులకు రూ.3వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని, ఇప్పుడు దాన్ని స్కిల్‌ డెవెలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు అప్పగించడం దారుణమన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, చిన్నారులు, మహిళలకు రక్షణ కరువైందన్నారు. మద్యం కేసులో ప్రభుత్వం చెప్పేవన్నీ భేతాళ కథలేనన్నారు. సంబంధం లేని వారిని ఇందులో ఇరికించి అరెస్ట్‌ చేయడం దారుణమన్నారు. ఈ ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఈ సమావేశంలో సోషల్‌ వెల్ఫేర్‌ బోర్డు మాజీ చైర్మన్‌ పులి సునీల్‌ కుమార్‌, ఈస్ట్‌ జోన్‌ అధ్యక్షుడు బీహెచ్‌ ఇలియాస్‌, వలంటీర్స్‌ విభాగం నాయకులు అఖిల్‌, భాస్కర్‌రెడ్డి, వంశీ పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు

పి. రవీంద్రనాథ్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement