
జిల్లా సమగ్రాభివృద్ధికి రాజీలేని పోరాటాలు
బద్వేలు అర్బన్ : జిల్లా సమగ్రాభివృద్ధికి సీపీఐ ఆధ్వర్యంలో రాజీలేని పోరాటాలు కొనసాగిస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర పేర్కొన్నారు. బద్వేలులో మూడు రోజుల పాటు జరిగిన సీపీఐ జిల్లా మహాసభలు గురువారంతో ముగిశాయి. ఇందులో భాగంగా స్థానిక సీపీఐ కార్యాలయం జేవీ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉక్కు పరిశ్రమ నిర్దిష్ట కాలవ్యవధిలో పూర్తిచేసి నిరుద్యోగ యువతను ఆదుకోవాలని కోరారు. అలాగే పెండింగ్‌లో ఉన్న గాలేరు–నగరి, తెలుగుగంగ, రాజోలి, వెలిగొండ రెండవ దశ పనులను పూర్తి చేయడంతో పాటు నికర జలాలు కేటాయించాలని కోరారు. సోమశిల, గండికోట, గాలేరు–నగరి ప్రాజెక్టుల పరిధిలోని నిర్వాసితులకు వెంటనే పరిహారం చెల్లించి పునరావాసం కల్పించాలని కోరారు. కడప నగరాన్ని స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చేయడంతో పాటు ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు, యర్రగుంట్ల, జమ్మలమడుగు, పులివెందుల పట్టణాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. కడప – బెంగుళూరు రైల్వే పనులు పూర్తి చేయడంతో పాటు మూతపడ్డ చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీ, ప్రొద్దుటూరు పాలకేంద్రాలను తెరిపించాలన్నారు.
నూతన కమిటీ ఎన్నిక
సీపీఐ జిల్లా మహాసభల సందర్భంగా గురువారం జరిగిన ప్రతినిధుల సభలో నూతన జిల్లా కార్యదర్శితో పాటు 17 మంది కార్యవర్గ సభ్యులను, 79 మంది కౌ న్సిల్ సభ్యులను ఎన్నుకున్నారు. ఇందులో జిల్లా కార్యదర్శిగా గాలిచంద్ర, జిల్లా కార్యవర్గ సభ్యులుగా బి.రా మయ్య, ఎల్.నాగసుబ్బారెడ్డి, పి.చంద్రశేఖర్, ఎన్.వెంకటశివ, పి.సుబ్బరాయుడు, సి.సుబ్రమణ్యం, వి.వీరశేఖర్, ఎం.వి.సుబ్బారెడ్డి, జి.వేణుగోపాల్, విజయలక్ష్మి, శ్రీరాములు, కె.సి.బాదుల్లా, గంగాసురేష్, పి.బా లు, జి.మద్దిలేటి, శంకర్‌నాయక్, వెంకటరాముడుల ను ఎన్నుకున్నారు. సమావేశంలో పలువురు జిల్లా కా ర్యవర్గ సభ్యులతో పాటు సీపీఐ ఏరియా సహాయ కా ర్యదర్శి మస్తాన్, రూరల్ కార్యదర్శి ఇమ్మానియేలు, ఏ ఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్, సీపీఐ పట్టణ సహా య కార్యదర్శి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన సీపీఐ జిల్లా మహాసభలు