
● కేసీ నీటితో కాస్త ఊరట
కడప అగ్రికల్చర్: ఆకాశమంతా మబ్బులు...నేలంతా చిత్తడి.. రోజంతా ముసురు.. ఇలా చల్లగా ఉండాల్సిన జూలై నెలలో ఎండలు మండుతున్నాయి. అసలిది వానాకాలమా.. ఎండా కాలమో అనే అనుమానం కలుగుతోంది. దీనికితోడు ఉక్కపోత. ఇది చాలదన్నట్లు గంటకు 25 నుంచి 30 కిలో మీటర్ల వేగంలో గాలులు వీస్తున్నాయి. ఫలితంగా భూగర్భ జలాలు సైతం అడుగంటి పోతున్నాయి. దీంతో జనాలు అల్లాడిపోతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాకముందు వర్షాలు కురిశాయి. ఈ ఏడాది ఇక వర్షాలకు కొదవ ఉండదనుకున్న అన్నదాతల ఆశలు ఆదిలోనే అడియాసలయ్యాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన తర్వాత వానదేవుడు పూర్తిగా ముఖం చాటేశాడు. దీంతో ఖరీఫ్ సీజన్‌లో సాగు చేసిన పంటలు కాస్తా వాడుముఖం పడుతున్నట్లు పలువురు అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రుతుపవనాలు ఎప్పుడొస్తాయో వర్షాలు ఎప్పుడు కురుస్తాయా అని అన్నదాతలు నింగికేసి చూస్తున్నారు.
జిల్లాలో 6.52 శాతం పంటలు సాగు
జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 77,475 హెక్టార్లలో సాధారణ సాగుగా అధికారులు ఖరారు చేశారు. సీజన్ ప్రారంభమై 45 రోజులు అయింది. ఇప్పటికి జిల్లావ్యాప్తంగా 6941.37 హెక్లార్లలో వివిధ పంటలు సాగై 6.52 శాతంగా పంటలసాగు నమోదయింది. ప్రస్తుతం జిల్లాలో 1571.43 హెక్టార్లలో వరిపంట, 358 హెక్టార్లలో సజ్జలు, 717.44 హెక్టార్లలో మొక్కజొన్న, 6 హెక్టార్లలో జొన్న, 42 హెక్టార్లలో కంది, 827.6 హెక్టార్లలో మినుము, 7 హెక్టార్లలో పెసర, 870.6 హెక్టార్లలో వేరుశనగ, 65.7 సన్‌ప్లవర్, 9.2 హెక్టార్లలో ఆముదం, 21 హెక్టార్లలో సోయాబీన్, 2429.07 హెక్టార్లలో పత్తి, 16 హెక్టార్లలో చెరకు మొత్తం కలిసి జిల్లావ్యాప్తంగా 6941.37 హెక్టార్లలో పంటలు సాగులో ఉన్నాయి.
లోటు వర్షపాతమే...
ఖరీప్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు సంవృద్ధిగా వర్షాలు కురవలేదు. దీంతో పంటలు వాడుముఖం పడుతున్నాయి. దీనికితోడు ప్రస్తుతం సాగు చేయాల్సిన వేరుశనగ, పసుపు, మినుము, జొన్న, సజ్జ, వరి వంటి పంటలసాగు అనుకున్న మేర సాగు కాలేదు. ప్రస్తుతం సాగులో ఉన్న పంటలు కూడా వాడుముఖం పడుతున్నాయి. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా జూన్ నెలలో 68.2 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా 22.8 మి.మీ మాత్రమే కురిసింది. సాధారణ వర్షపాతం కంటే 66.6 శాతం తక్కువ వర్షం కురిసింది, అలాగే జులై నెలకు సంబంధించి ఇప్పటి వరకు 43.67 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా ఇప్పటికి 7.1 మి.మీ మాత్రమే కురిసి లోటు వర్షపాతంగా మిగిలింది.
ముఖం చాటేసిన వరుణుడు
వర్షం కోసం రైతుల ఎదురు చూపులు
విపరీతంగా వీస్తున్న ఈదురుగాలులు
ఎగువన కురిసిన వర్షాలకు ఈ ఏడాది శ్రీశైలం డ్యాం నిండింది. దీంతో ఈ ఏడాది సకాలంలోనే కేసీ కెనాల్‌కు నీరు విడుదల చేశారు. దీంతో కేసీ కెనాల్ కింద ఇక సాగు పనులు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం కేసీ కెనాల్ కింద సాగులో ఉన్న పంటలకు నీరు అందనుంది. దీంతోపాటు కేసీ రైతులు ఇక నారుమడులను సాగు చేయనున్నారు. కాకపోతే విపరీతమైన గాలులు వీస్తుంటంతో నారుముడులు సరిగా మొలకెత్తవని రైతులు ఆందోళన చెందుతున్నారు. వరినాటు వేసినా ఈ గాలికి సాగు చేసిన వరిపంట ఎండుముఖం పట్టే అవకాశం కూడా ఉన్నట్లు రైతులు తెలిపారు.

● కేసీ నీటితో కాస్త ఊరట

● కేసీ నీటితో కాస్త ఊరట

● కేసీ నీటితో కాస్త ఊరట

● కేసీ నీటితో కాస్త ఊరట