● ఏప్రిల్‌, మే, జూన్‌, జూలై నెలలకు సంబంధించి.. | - | Sakshi
Sakshi News home page

● ఏప్రిల్‌, మే, జూన్‌, జూలై నెలలకు సంబంధించి..

Jul 18 2025 5:30 AM | Updated on Jul 18 2025 5:32 AM

నాపేరు వేమిరెడ్డి చంద్ర ఓబుల్‌రెడ్డి. మాది దువ్వూరు మండలం క్రిష్ణంపల్లి గ్రామం. నాకు 15 ఎకరాల పొలం ఉంది. ప్రస్తు తం 4 ఎకరాల్లో అరటి, 6 ఎకరాల్లో పసుపు పంటను సాగు చేశాను. పంటల సాగుకు సంబంధించిన ఎరువులను గతంలో మేము మా గ్రామంలోని రైతు భరోసా కేంద్రం ద్వారా తెచ్చుకునే వాళ్లం. ఇప్పుడా పరిస్థితి లేదు. దువ్వూరులోని ప్రైవేటు డీలర్ల వద్ద అతి కష్టం మీద తెచ్చుకున్నాను. యూరియా కావాలని ప్రత్యేకంగా అడికితే కాంప్లెక్స్‌ ఎరువులను తీసుకుంటేనే యూరియా ఇస్తామని డీలర్లు చెబుతున్నారు. కాంప్లెక్స్‌ ఎరువులు అవసరం లేకపోయినా యూ రియా కోసం కొనక తప్పడం లేదు. పైగా గతంలో గ్రామంలోని ఆర్‌బీకే సిబ్బంది విత్తనాలు, ఎరువులను పరీక్షించి నకిలీవా, నాణ్యమైనవా పరిశీలించి ఇచ్చేవారు. ఇప్పుడు అ పరిస్థితి లేదు. విత్తనాలు, ఎరువులను బయట నుంచి తెచ్చుకుని సాగు చేసుకోవాల్సి వస్తుంది. అవి మంచివో లేక నకిలీవో తెలియని పరిస్థితి నెలకొంది. ఇన్ని ఆటుపోట్ల మధ్య వ్యవసాయ సాగు భారంగా ఉంది.

కడప అగ్రికల్చర్‌: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న ఊర్లలోనే రైతన్నలకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు రైతు భరోసా కేంద్రాల్లో లభించేవి. నేడు ఆ పరిస్థితి కరువైంది. ఎరువులు, విత్తనాల కోసం మండల కేంద్రాలకు పరుగు తీయాల్సి వస్తోంది. దీంతో అన్నదాతలకు అవస్థలు తప్పడం లేదు. జిల్లాలో ఖరీఫ్‌లో 77475 హెక్టార్ల సాగు లక్ష్యంగా వ్యవసాయ అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమై 45 రోజులు దాటినా వర్షం లేకపోవడంతో.. సాగు పనులు అంతగా ఊపు లేవు. రెండు రోజుల క్రితం కేసీ కాలువకు నీటిని విడుదల చేశారు. దీంతో కేసీ కెనాల్‌ కింద రైతన్నలు పంటల సాగుకు సమాయత్తం అయ్యారు. అయితే ఎరువులు, విత్తనాలు అవసరం మేరకు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రైవేటు వ్యక్తులపైన ఆధార పడాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో ఉన్న రైతు సేవా కేంద్రాలకు ఎరువులు, విత్తనాలను అరకొరగా కేటాయించడంతో.. ఈ పరిస్థితి నెలకొంది. దీంతోపాటు ఎరువులు సకాలంలో సరఫరా కాకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో ప్రైవేటు డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు వాపోతున్నారు.

ప్రతిపాదనలు పంపినా.. తక్కువగా కేటాయింపు

ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి జిల్లాకు 69,653 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరంగా వ్యవసాయ అధికారులు ప్రతిపాదనలు పంపగా.. ఇందులో 40,390 మెట్రిక్‌ టన్నులు కేటాయించారు. ఇందులో 7146.30 మెట్రిక్‌ టన్నుల ఎరువులు మాత్రమే మంజూరు చేశారు. గతేడాదివి 27073.08 మెట్రిక్‌ టన్నులు అందుబాటులో ఉండగా.. ఇందులో రీటైలర్‌, హోల్‌సెల్‌ డీలర్లు వద్ద 26,466.74 మెట్రిక్‌ టన్నుల ఉంచగా.. రైతు సేవా కేంద్రాల్లో కేవలం 606.38 మెట్రిక్‌ టన్నులు ఉంచారు. ఈ విషయంలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతు భరోసా కేంద్రాలలో అధిక ఎరువులను ఉంచితే రైతులకు సమస్య లేకుండా పోయేదని పేర్కొంటున్నారు. ప్రైవేటు డీలర్లు అధిక ధరలకు విక్రయిస్తున్నారని వాపోతున్నారు.

పంట పేరు సాధారణ సాగు సాగైన పంట

(హెక్టార్లలో) (హెక్టార్లలో)

వరి 30804 1571.43

జొన్న 517 6

సజ్జ 1089 358

మొక్కజొన్న 932 717.44

కంది 5761 42

మినుము 3806 827.7

వేరుశనగ 5976 870.93

సన్‌ఫ్లవర్‌ 1142 65.7

సోయాబీన్‌ 1030 21

పత్తి 24036 2429.07

ప్రభుత్వం అరకొరగా మంజూరు

విత్తనాల కేటాయింపు అంతంత మాత్రమే

అధిక ధరకు విక్రయిస్తున్న డీలర్లు

అన్నదాతకు తప్పని అవస్థలు

ఖరీఫ్‌ సీజన్‌లో భాగంగా ఏప్రిల్‌, మే, జూన్‌, జూలై నెలలకు 20538 మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరంగా వ్యవసాయ అధికారులు ప్రతిపాదనలను పంపగా.. ఇందులో 12025 టన్నులు కేటాయించారు. ప్రస్తుతం 3062.3 టన్నులను మాత్రమే మంజూరు చేశారు.

డీఏపీకి సంబంధించి 9862 మెట్రిక్‌ టన్నులు అవసరంగా ప్రతిపాదనలు పంపగా.. 4860 మెట్రిక్‌ టన్నులను కేటాయించారు. ప్రస్తుతం 1826 టన్నులు మంజూరు చేశారు.

కాంప్లెక్స్‌ ఎరువులు 32704 మెట్రిక్‌ టన్నులు అవసరంగా ప్రతిపాదనలు పంపగా.. 20195 టన్నులు కేటాయించారు. ఇందులో ప్రస్తుతం 2258 టన్నులు మంజూరు చేశారు.

ఎంఓపీకి సంబంధించి 2791 టన్నుల కోసం ప్రతిపాదనలు పంపగా, 1620 టన్నులు కేటాయించారు.. కానీ ఏమీ మంజూరు చేయలేదు.

ఎస్‌ఎస్‌పీకి సంబంధించి 3758 మెట్రిక్‌ టన్నులు అవసరంగా ప్రతిపాదనలు పంపగా.. ఇందులో 1690 టన్నులు కేటాయించారు. కానీ ఏమీ మంజూరు చేయలేదు. ఇలా మొత్తంగా ఖరీఫ్‌ సీజన్‌కు 69,653 మెట్రిక్‌ టన్నుల ఎరువులకు గాను కేవలం 7146.3 మెట్రిక్‌ టన్నులు మాత్రమే మంజూరు చేశారు.

రీటైల్స్‌, హోల్‌సెల్‌, ఆర్‌ఎస్‌కేలలో కలిపి..

గతేడాది రీటైలర్స్‌, హోల్‌సెల్‌, ఆర్‌ఎస్‌కేల ద్వారా పంపిణీ చేయగా.. మిగిలిన ఎరువులను రీటైలర్స్‌, హోల్‌సెల్‌, ఆర్‌ఎస్‌కేలలో అందుబాటులో ఉంచారు. ఇందులో యూరియా రీటైలర్‌ వద్ద 3546.52 మెట్రిక్‌ టన్నులు, హోల్‌సెల్‌ డీలర్ల వద్ద 2630.57 మెట్రిక్‌ టన్నులు ఉండగా.. రైతు సేవా కేంద్రాలలో కేవలం 321.03 మెట్రిక్‌ టన్నులు అందుబాటులో ఉంది.

డీఏపీకి సంబంధించి రీటైలర్‌ వద్ద 1121.65 మెట్రిక్‌ టన్నులు, హోల్‌సెల్‌ డీలర్ల వద్ద 1544 మెట్రిక్‌ టన్నులు, రైతు సేవా కేంద్రంలో 136.4 టన్నులు అందుబాటులో ఉన్నాయి.

కాంప్లెక్స్‌లు రీటైలర్‌ వద్ద 7236.76 టన్నులు, హోల్‌సెల్‌ డీలర్ల వద్ద 5204.92 టన్నులు, రైతు సేవా కేంద్రంలో 101.45 మెట్రిక్‌ టన్నులు అందుబాటులో ఉన్నాయి.

ఎంఓపీ రీటైలర్‌ వద్ద 1648.60 మెట్రిక్‌ టన్నులు, హోల్‌సెల్‌ డీలర్‌ వద్ద 1241.35 మెట్రిక్‌ టన్నులు, ఆర్‌ఎస్‌కే కేంద్రాల్లో 47.75 టన్నులు ఉంచారు.

ఎస్‌ఎస్‌పీకి సంబంధించి 2074.04 మెట్రిక్‌ టన్ను లు రీటైర్స్‌ వద్ద, 218.35 మెట్రిక్‌ టన్నులు హోల్‌ సెట్‌ వద్ద ఉండగా.. ఆర్‌ఎస్‌కేలో మాత్రం లేవు.

● ఏప్రిల్‌, మే, జూన్‌, జూలై నెలలకు సంబంధించి.. 1
1/2

● ఏప్రిల్‌, మే, జూన్‌, జూలై నెలలకు సంబంధించి..

● ఏప్రిల్‌, మే, జూన్‌, జూలై నెలలకు సంబంధించి.. 2
2/2

● ఏప్రిల్‌, మే, జూన్‌, జూలై నెలలకు సంబంధించి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement