
ఇన్‌చార్జి కలెక్టర్ అదితిసింగ్
ప్రభుత్వ సేవలపై
సంతృప్త స్థాయి పెంచాలి
కడప సెవెన్ రోడ్స్: ప్రభుత్వ సేవలపై ప్రజల్లో సంతృప్త స్థాయి పెంచేలా పనిచేయాల్సి ఉంటుందని ఇన్‌చార్జి కలెక్టర్ అదితిసింగ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ కలెక్టర్లతో గురువారం వీడియో కాన్పరెన్స్ ద్వారా సమీక్షించారు. అనంతరం ఇన్‌చార్జి కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి సానుకూలత పెరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. బద్వేల్ నియోజకవర్గంలో ఎంఎస్‌ఎంఈ పార్కు స్టోన్ ఫౌండేషన్ పనులు పెండింగ్ లేకుండా చూడాలన్నారు. జీరో పావర్టీ, పీ–4పాలసీ, బంగారు కుటుంబాలు, మార్గదర్శులు గ్రామ సభలు, జనాభా నిర్వహణ అంశాలపై అధికారులు దృష్టి సారించాలని సూచించారు. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకంలో భాగంగా జిల్లాలో మిగిలిన వున్న గ్రామాలను కవర్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీపీవో హజరతయ్య, పరిశ్రమల శాఖ జీఎం చాంద్‌బాషా, కడప మున్సిపల్ కమిషనర్ మనోజ్‌రెడ్డి, ఆర్టీసీ ఆర్‌ఎం పీ.గోపాల్ రెడ్డి, జెడ్పీ సీఈవో సుబ్రహ్మణ్యం, సోషల్ వెల్ఫేర్ డీడీ సరస్వతి, జిల్లా రిజిస్ట్రార్ పీవీఎన్.బాబు, అధికారులు పాల్గొన్నారు.