
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో కేఎంసీకి మూడో ర్యాంకు
కడప కార్పొరేషన్: స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో కడప మున్సిపల్ కార్పొరేషన్(కేఎంసీ)కు రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంకు లభించింది. జాతీయ స్థాయిలో 31వ ర్యాంకు వచ్చింది. 2019 నుంచి స్వచ్ఛ సర్వేక్షణ్ కింద ఇచ్చిన ర్యాంకుల్లో ఇదే అత్యుత్తమం కావడం గమనార్హం. 2019లో జాతీయ స్థాయిలో 62వ ర్యాంకు రాగా, 202లో 54, 2021లో 56, 2022లో 56, 2023లో 58వ ర్యాంకులు లభించాయి. 2024 సంవత్సరంలో నిర్వహించిన సర్వేల్లో కడపకు అతి తక్కువగా 31వ ర్యాంకు లభించింది. చెత్తను తడి, పొడి చెత్తలుగా విడదీయడంలో 48 శాతం, ఆ చెత్తలు ప్రాసెసింగ్ చేయడంలో 98 శాతం మార్కులు లభించాయి. గత ఏడాది జీఎఫ్‌సీ స్టేటస్‌లో త్రీస్టార్ రాగా, ఈ ఏడాది సింగిల్ స్టార్ వచ్చింది. బహిరంగ మల, మూత్ర విసర్జన చేయకపోవడం వల్ల ఓడీఎఫ్(ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ) ప్లస్, ప్లస్ స్టేటస్ వచ్చింది. విజయవాడ, తిరుపతి, గుంటూరు, విశాఖపట్నం, రాజమండ్రి నగరాల తర్వాత స్వచ్ఛ సర్వేక్షణ్‌లో అన్ని విభాగాల్లో కడపకే ఎక్కువ మార్కులు పడ్డాయని చెప్పవచ్చు.
జాతీయ స్థాయిలో 31వ ర్యాంకు

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో కేఎంసీకి మూడో ర్యాంకు