కడప కోటిరెడ్డి సర్కిల్: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సులలో మూడు నెలలపాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి సురేష్ కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మూడు నెలల కోర్సుకు సంబంధించి పదవ తరగతి, ఆపై విద్యార్హత కలిగిన వారు ఈనెల 17వ తేదీలోపు తమ కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9392348430 అనే ఫోన్ నెంబర్‌కు సంప్రదించాలని సూచించారు.
దరఖాస్తుల ఆహ్వానం
కడప ఎడ్యుకేషన్: కడప నగరంలోని ప్రభుత్వ పురుషుల కళాశాల (ఆర్ట్స్ కళాశాల)లో పొలిటికల్ సైన్సు, హిస్టరీ, ఎకనామిక్స్, జియాలజి,కంప్యూటర్ సైన్సు/అప్లికేషన్ సబ్జెక్టులకు అతిథి అధ్యాపక ఉద్యోగాలకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ జి.రవీంద్రనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూలై 18 వ తేదీ కళాశాలలో ఉదయం 10.30 గంటలకు ప్రిన్సిపాల్ కార్యాలయంలో హాజరు కావాలని సూచించారు. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలని వివరించారు. నెట్, స్లెట్ , పీహెచ్‌డీ అర్హతలు కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు ఒక సెట్టు జిరాక్సు కాపీలతో హాజరు కావాలని ఆయన సూచించారు.
సికింద్రాబాద్ – తిరుపతి మధ్య ప్రత్యేక రైలు
కడప కోటిరెడ్డి సర్కిల్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్ – తిరుపతి మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నారని కడప రైల్వే కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ జనార్థన్ తెలిపారు. 07009 నంబరుగల రైలు ప్రతి గురువారం సికింద్రాబాద్‌లో ఈనెల 31, ఆగస్ట్ 7, 14, 21, 28వ తేదీల్లో, 07010 నంబరు గల రైలు తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు ప్రతి శుక్రవారం ఆగస్ట్ 1, 8, 15, 22, 29వ తేదీల్లో నడుస్తుందన్నారు. సికింద్రాబాద్‌లో ప్రతి గురువారం రాత్రి 10గంటలకు బయలుదేరి కాచిగూడ, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల మీదుగా కడపకు ఉదయం 7.05గంటలకు చేరుకుని, రాజంపేట, రేణిగుంట మీదుగా తిరుపతికి ఉదయం 10.30గంటలకు చేరుకుంటుందన్నా రు. అలాగే ప్రతి శుక్రవారం తిరుపతిలో సాయంత్రం 4.40గంటలకు బయలుదేరి ఇదే మార్గంలో సికింద్రాబాద్‌కు ఉదయం 6.45గంటలకు చేరుతుందని ఆయన తెలిపారు. ఇప్పటికే రిజర్వేషన్ సౌకర్యం కల్పించామని, ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో వాలని ఆయన కోరారు.
యువతకు ఉచిత శిక్షణ
యువతకు ఉచిత శిక్షణ