
సాగర్ పనుల్లో జాప్యమేల !
బ్రహ్మంగారిమఠం : బ్రహ్మంసాగర్ ఆనకట్ట ఆధునికీకరణ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో పనులు పూర్తిగా నిలిచిపోయాయి. తెలుగు గంగలో అంతర్భాగమైన బ్రహ్మంసాగర్ ఆనకట్ట లీక్‌లను అరికట్టేందుకు 2021లో అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.70కోట్లు నిధులు విడదల చేసింది. ఈ నిధులద్వారా కట్టకు పడ్డ రంధ్రం మరమ్మతులు కట్టపైన బీటీ రోడ్డు, సేఫ్టీ గ్రిల్స్ , లైటింగ్స్, పార్కుల ఆధునికీకరణ, గెస్ట్‌హౌస్ మరమ్మతులు తదితర పనులకు టెండర్లు పిలవగా మెగా కంపెనీ పనులు చేసేందుకు ముందుకు వచ్చింది.
లీకులు సరిచేసి..
టెండర్లు దక్కించుకున్న సదరు కంపెనీ ఆనకట్టకు పడ్డ రంధ్రం మరమ్మతులు చేసింది. 12 టీఎంసీ వరకు నీరు నిల్వ ఉంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశారు. ఇంతలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. అంతే పనులు నిలిచిపోయాయి. ఈ ప్రభుత్వం సదరు కంపెనీపై ఒత్తిడి తెచ్చి మిగిలిన పనులు చేయాలని ఆదేశించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోంది. పనులు పూర్తి చేస్తేనే బిల్లులు కూడా పూర్తి స్థాయిలో వస్తాయని అధికారులు అంటున్నారు. ఇప్పటికై నా సాగర్ కట్టపైన మిగిలిన పనులు పూర్తిచేయాలని రైతులు, స్థానికులు కోరుతున్నారు.
గత ప్రభుత్వ హయాలో రూ.70 కోట్ల నిధులు విడుదల
కూటమి ప్రభుత్వంలోముందుకు సాగని పనులు

సాగర్ పనుల్లో జాప్యమేల !

సాగర్ పనుల్లో జాప్యమేల !