
పర్యావరణానికి చాలా ఉపయోగం
ప్రధాన మంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద ఇంటి పైకప్పు పైన సోలార్ ఫలకలు అమర్చుకుంటే పర్యావరణ కాలుష్యం తగ్గడంతోపాటు సహజ వనరులైన నీరు, బొగ్గు కొరత రాకుండా ఉంటుంది. వినియోగదారుడు ఎన్ని కిలోవాట్లయినా సౌర ఫలకలు అమర్చుకోవచ్చు. వారికి గరిష్టంగా రూ.78వేలు మాత్రమే సబ్సిడీ వస్తుంది. వినియోగదారులు ప్రతినెలా చెల్లించే విద్యుత్ బిల్లును బ్యాంకు ఈఎంఐ కడితే ఆ తర్వాత విద్యుత్ బిల్లు చెల్లించకుండా ఉచిత కరెంటు పొందవచ్చు.
– హరిసేవ్యా నాయక్,
ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు. కడప డివిజన్