ప్రగతిచక్రం.. స్వర్ణోత్సవం | - | Sakshi
Sakshi News home page

ప్రగతిచక్రం.. స్వర్ణోత్సవం

Jul 9 2025 7:13 AM | Updated on Jul 9 2025 7:13 AM

ప్రగత

ప్రగతిచక్రం.. స్వర్ణోత్సవం

ఉభయ వైఎస్సార్‌ జిల్లాలో కడప తర్వాత ఏర్పాటైంది రాజంపేట ఆర్టీసీ డిపో. ఇది ఏర్పాటై 50ఏళ్లు పూర్తి కానుంది. కేవలం ఏడు బస్సులను రోడ్డుపైకి తీసుకొచ్చారు.గోల్డెన్‌ జూబ్లీ చేసుకోనున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం.

రాజంపేట: ఉభయ వైఎస్సార్‌ జిల్లాలో పార్లమెంటరీ కేంద్రమైన రాజంపేటలో ఆర్టీసీ ఆవిర్భావం ఐదు దశాబ్దాలకు చేరుకుంది. 1975 ఆగస్టు 15న డిపో ఏర్పాటుచేయాలని అప్పట్లో సంస్థ నిర్ణయించింది. కడప తర్వాత ఏర్పాటైన తొలి డిపో. ఈ క్రమంలో రాజంపేట–రాయచోటి రోడ్డులోని ఇప్పుడున్న ఎల్‌ఐసీ కార్యాలయానికి ఎదురుగా ఉన్న ప్రాంతంలో తాత్కాలికంగా కంచె ఏర్పాటుచేసి, అక్కడి నుంచి ఆర్టీసీ సేవలను తాత్కాలికంగా ప్రారంభించారు. కడపకు అప్పటికే ఏర్పాటైన డిపో నుంచి కండక్టర్లు, డ్రైవర్లు, గ్యారేజీ కార్మికులను రప్పించారు. ఏడుబస్సులను తొలిసారిగా రొడ్కెక్కించారు.చరిత్ర ఘనంగా ఉన్నా అభివృద్ధి తిరోగమన దిశలో ఉంది. 50 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో స్వర్ణోత్సవాలు నిర్వహిస్తారా అని కార్మికులు ఎదురు చూస్తున్నారు.

మాజీ ఎమ్మెల్యే కొండూరు

ప్రభావతమ్మ హయాంలో..

మాజీ శాసనసభ్యురాలు కొండూరు ప్రభావతమ్మ ఆధ్వర్యంలో రాజంపేటలో ఆర్టీసీ ఏర్పాటుకు ప్రస్తుతం ఎర్రబల్లి ప్రాంతంలోని ఆరున్నర ఎకరాలకు పైగా ఉన్న స్ధలాన్ని ఎంపిక చేశారు. ఆ స్ధలంలో బస్‌స్టేషన్‌, ఆర్టీసీ కార్మికుల క్వార్టర్స్‌, డిపో గ్యారేజీల నిర్మాణం చేపట్టారు.ఇప్పుడు ఆర్టీసీ బస్టాండు ఇదే.ప్రస్తుతం ఈ స్థలాలకు కోట్లాది రూపాయల విలువ ఉంది. ఆర్టీసీ బస్టాండు,డిపో పట్టణానికే కేంద్రంగా మారింది.

● డిపో ఏర్పాటు తర్వాత అంచెలంచెలుగా అభివృద్ధి చెందింది. కడప జిల్లాలోని కడప, ప్రొద్దుటూరుతో సమానంగా బస్సు సర్వీసులను ఇక్కడి నుంచి నడిపారు. 2011–2012 వరకు 125 బస్సులు ఉండేవి. ఆర్టీసీ కార్మికులతో కళకళలాడింది. సబ్‌డివిజన్‌ పరిధిలో రైల్వేకోడూరు, రాజంపేట పరిసర ప్రాంతాల్లోని మారుమూల గ్రామాలకు బస్సులను ఏర్పాటు చేశారు. పల్లెపల్లెకు బస్సులు నడిచేవి. ప్రజలకు మెరుగైన సేవలందిస్తూ వచ్చింది.

● మాజీ ముఖ్యమంత్రి జలగంవెంగళరావు, మాజీ ఎమ్మెల్యే ప్రభావతమ్మ హయాంలో చరిత్ర సృష్టించిన డిపో..ఇప్పుడైతే తిరోగమనదిశలో పయనిస్తుందనే విమర్శలున్నాయి. బస్సు సర్వీసులు తగ్గిపోయాయి. సగానికిపైగా పల్లెలకు బస్సులు తిరగడంలేదు. ప్రైవేట్‌ వాహనాల కారణమని ఆర్టీసీ వారు చెబుతున్నారు. ఆర్టీసీకి 40 బస్సులు ఉండగా, అద్దె బస్సులు 30 ఉన్నాయి. ఆర్టీసీ ఆదాయం కూడా ఘననీయంగా పడిపోతూవచ్చింది.

పూర్వవైభవం వచ్చేనా...

రాజంపేట ఆర్టీసీ డిపో రోజురోజుకు తిరోగమన దిశలో ఉంది. కొత్తకొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. హైదరాబాద్‌, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నంతోపాటు పలు పుణ్యక్షేత్రాలకు డిపోనుంచి డైరెక్ట్‌ కనెక్టివిటీ సర్వీసులను ఫ్రీక్వెన్సీగా పెంచాలని ఆర్టీసీ వర్గాలవారు అంటున్నారు. నందలూరు ఆర్‌ఎస్‌ టు రాజంపేట ఆర్‌ఎస్‌ బసు సర్వీసుతోపాటు పల్లె సర్వీసులను పున రుద్ధరించాల్సిన అవసరం ఉంది. బ్యాటరీ బస్సులను ప్రవేశపెడితే రాజంపేట ఆర్టీసీ డిపోకు పూర్వవైభవం వస్తుందని కార్మికులు చెబుతున్నారు. వందలాది రూట్‌లలో బస్సు సర్వీసులు ఉండగా, ఇప్పుడు 37 సర్వీసులకు వచ్చింది. ప్రస్తుతం 343 మంది కార్మికులు ఉన్నారు.

రాజంపేట ఆర్టీసీ డిపో ఏర్పాటై 50 ఏళ్లు పూర్తి కావస్తోంది. 50 ఏళ్ల కిందట వేసి శిలాఫలకం కాలగర్భంలో కలిసిపోయింది. సిల్వర్‌జూబ్లీ చేసుకుంటున్న క్రమంలో ఆర్టీసీ అభివృద్ధిలో నూతన మార్పులు వస్తాయా? ఆ దిశగా ఆర్టీసీ యాజమాన్యం ఆలోచిస్తుందా అని కార్మికులు ఎదురుచూస్తున్నారు.

ఏడు బస్సులతో డిపో ప్రారంభమైంది

కేవలం ఏడుబస్సులతో రాజంపేట ఆర్టీసీ డిపో ప్రారంభమైంది. సాతుపల్లెకు ఎదురుగా ఖాళీస్థలంలో తాత్కలికంగా బస్టాండు ఏర్పాటు చేసి, అక్కడి నుంచి బస్సులను నడిపించారు. 1975లో డిపో ఏర్పాటులో పనిచేసే అవకాశం తనకు కలగడం అదృష్టంగా భావిస్తున్నాను. –ఎం.బ్రహ్మయ్య, మాజీ కండక్టరు. రాజంపేట

పూర్వవైభవం తీసుకురావాలి

కడప తర్వాత రాజంపేటలోనే ఆర్టీసీ సేవలు అందుబాటులోకి వచ్చాయి.డిపో ఏర్పాటై 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా గోల్డెన్‌ జూబ్లీ వేడుకలను నిర్వహించాలి. ఆ బాధ్యత ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం తీసుకోవాలి. బస్సుస్టేషన్‌ ఆధునికీకరణతోపాటు కొత్త బస్సులు, అదనపు సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలి. రాజంపేట డిపోకు పూర్వవైభవం కల్పించాలి.

–జీవీ నరసయ్య, రాష్ట్ర ప్రధానకార్యదర్శి, ఎంప్లాయీస్‌ యూనియన్‌

ప్రగతిచక్రం.. స్వర్ణోత్సవం1
1/3

ప్రగతిచక్రం.. స్వర్ణోత్సవం

ప్రగతిచక్రం.. స్వర్ణోత్సవం2
2/3

ప్రగతిచక్రం.. స్వర్ణోత్సవం

ప్రగతిచక్రం.. స్వర్ణోత్సవం3
3/3

ప్రగతిచక్రం.. స్వర్ణోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement