
ఫిర్యాదులకు నాణ్యమైన పరిష్కారం అందించాలి
కడప సెవెన్‌రోడ్స్ : పీజీఆర్‌ఎస్ కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం అందించాలని జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సభాభవన్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్) కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ అదితిసింగ్, డీఆర్వో విశ్వేశ్వర నాయుడు, వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఫిర్యాదులకు అధికారులు క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలన్నారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలని సూచిస్తూ అనంతరం అర్జీదారుల నుండి వారు అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎస్డీసీ వెంకటపతి, మెప్మా పీడీ కిరణ్ కుమార్,వివిధ శాఖల అధికారులు,తదితరులు పాల్గొన్నారు.
జేసీ అదితిసింగ్