
ఏడీసెట్ విడుదల చేయపోవడం వెనుక రాజకీయ కుట్ర
కడప కార్పొరేషన్ : కూటమి ప్రభుత్వం ఆర్కిటెక్చర్ అండ్ డిజైనల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(ఏడీసెట్) విడుదల చేయకపోవడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా అనుమానం వ్యక్తం చేశారు. సోమవారం డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఎదుట ఆరు రోజులుగా విద్యార్థులు చేస్తున్న నిరాహార దీక్షలకు వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్యతో కలిసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా అంజద్‌బాషా మాట్లాడుతూ ఈ యూనివర్సిటీకి సీఓఏ పర్మిషన్ వెంటనే ఇవ్వాలన్నారు. ఏడీసెట్ నోటిఫికేషన్ విడుదల చేసి ఈ ఏడాది విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వాలన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి ఆర్కిటెక్చర్ విద్యార్థుల సమస్యలను తీసుకెళతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌కు ఆయన ఫోన్ చేయగా ఆయన అందుబాటులోకి రాలేదు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మహమ్మద్ షఫీ, జిల్లా ఉపాధ్యక్షుడు దాసరి శివప్రసాద్, రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శి గురు ప్రసాద్, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు గురు సాయి దత్త, నాయకులు ఇబ్రహీం మియా, సాయిఫ్, తదితరులు ఉన్నారు.
మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా